37.2 C
Hyderabad
April 16, 2024 12: 45 PM
Slider ప్రత్యేకం

అకేషన్: ట్రంప్ తో విందుకు అతి కొద్ది మందిలో కేసీఆర్

cm kcr

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు ఇస్తున్న విందుకు హాజరై ఆతిథ్యం స్వీకరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కు రాష్ట్రపతి భవన్ నుంచి ఇన్విటేషన్ వచ్చింది. దేశ విదేశాల నుంచి అతి తక్కువగా అంటే 90 నుంచి 95 మంది అతిధులను మాత్రమే ఈ విందుకు ఆహ్వానిస్తున్నారు. అలాంటి విందుకు సీఎం కేసీఆర్ కు ఆహ్వానం రావడం విశేషం. 25 వ తేదీ రాత్రి 8 గంటలకు రాష్ట్రపతి భవన్ లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాంనాథ్ కొవింద్ విందు ఇస్తున్నారు.

అందులో పాల్గొనేందుకు ఈనెల 24 వ తేదీ సాయంత్రం లేదా 25 వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం కేసీఆర్ వెళుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా కేవలం కొద్దిమంది కేంద్ర మంత్రులకే రాష్ట్రపతి ఆహ్వానం పంపారు. అస్సాం, హర్యానా, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, తెలంగాణా కలిపి మొత్తం 8 మంది ముఖ్యమంత్రులకు మాత్రమే రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది.

Related posts

గృహలక్ష్మి పథకం గడువు ఆగస్ట్‌ 31 వరకు పొడిగించాలి

Bhavani

ప్రపంచ మత్స్యకార దినోత్సవం ప్రారంభం

Satyam NEWS

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో తలతిక్క నిర్ణయం

Satyam NEWS

Leave a Comment