30.7 C
Hyderabad
April 19, 2024 09: 02 AM
Slider తెలంగాణ

దేశంలో లాక్ డౌన్ కొనసాగడమే మంచిది

KCR PC 061

దేశంలో లాక్ డౌన్ మరి కొద్ది రోజులు కొనసాగించాలనే తాను చెబుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రధాని మోడీతో రెగ్యులర్ గా చాలా విషయాలు మాట్లాడుతున్నానని దేశం మొత్తం ఇప్పుడు ఏకతాటిపై నడవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. నేడు ఆయన ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

కరోన వైరస్ వ్యాధి ప్రబలడం ప్రారంభం అయ్యాక కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయంగ వచ్చిన సూచనలు సలహాలు పాటించారు. ఈ జబ్బు మన దగ్గర పుట్టింది కాదు కాబట్టి వెనుక ముందు కేంద్ర ప్రభుత్వం కూడా లాక్ డౌన్,జనతా కర్ఫ్యూ పాటించింది. దీనితో మన దేశం చాలా గొప్పగా ఉంది.

మన దేశం చాలా సేఫ్ గా ఉంది అని ఆయన అన్నారు. అమెరికా లాంటి ధనిక దేశంలో శవాల గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయని ట్రక్ లలో శవాలు పంపిస్తున్నారని కేసీఆర్ అన్నారు. మన దేశంలో లాక్ డౌన్ వల్ల అలాంటి పరిస్థితి తప్పిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

మధ్యలో వచ్చిన నిజముద్దీన్ కేస్ లు దేశం మొత్తం కూడా అతలాకుతలం చేశారు. మొత్తం 364 మందికి సోకింది. ఇండోనేషియా వాళ్ళు కూడా 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం 11 మంది చనిపోయారని ఆయన అన్నారు. నిజాముద్దీన్ వెళ్లి వచ్చిన వారిలో 1089 మందిని పెట్టుకున్నాం.

30 నుండి 35 మంది ఢిల్లీలో ఉంటారు వారికి అక్కడే ట్రీట్మెంట్ చేసి ఉంటారు. ఇందులో 170 మందికి వైరస్ వచ్చింది. చనిపోయిన వారు కూడా ఇందులో వారే అని కేసీఆర్ చెప్పారు. ఇంటలిజెన్స్ పోలీసులు చాలా కష్టపడ్డారు వారికి అభినందనలు అని కేసీఆర్ అన్నారు. లాక్ డౌన్ కు ప్రజలు చాలా సహకారాన్ని అందించారు ఇంకా సహకారం ఇవ్వాలి. ప్రపంచ వ్యాప్తంగా 22 దేశాలు లాక్ డౌన్ చేశాయి. మిగతా 90 దేశాలు పాక్షికంగా లాక్ డౌన్ చేశాయి,సమస్య ఎంత తీవ్రంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు అని కేసీఆర్ తెలిపారు.

Related posts

మేం పాఠాలు చెప్పం… ఆ విషయం బయటకు తెలిస్తే ఊరుకోం

Satyam NEWS

టీఆర్ఎస్ పార్టీ పనులకు గ్రామ పంచాయితీ సిబ్బంది

Satyam NEWS

తిరుపతి మిస్టరీ హత్యకేసులో ముద్దాయి అరెస్ట్….

Satyam NEWS

Leave a Comment