31.7 C
Hyderabad
April 25, 2024 02: 00 AM
Slider తెలంగాణ

6వ రోజు ఆర్టీసీ కార్మికుల మోకాళ్ళ పై బిక్షాటన

kollapur rtc 1

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతున్న సంగతి తెలిసిందే. కొల్లాపూర్ ఆర్టీసీ కార్మికులు ఆరవ రోజు తమ సమస్యలపై రాష్ట ప్రభుత్వానికి బిక్షాటన ద్వారా  నిరసనలు తెలిపారు. అంబేద్కర్ చౌరస్తా నుండి కార్మికులు ర్యాలీ నిర్వహించారు. రాష్ట ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని సీఎం డాం డాం,ఆంధ్ర సీఎం అచ్చా! తెలంగాణ సీఎం లుచ్చా! అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులకు దసరా పండుగకు ప్రభుత్వం జీతం ఇవ్వలేదు అంటూ మెయిన్ రోడ్ పై మోకాళ్లపై బిక్షాటన చేశారు. అఖిలపక్ష నాయకులు మద్దతు తెలిపి ఆర్థికసాయం చేశారు. సుమారు అర్ధగంట సేపు ఎన్టీఆర్ చౌరాస్తాలో మానవహారం నిర్వహించారు. కాంగ్రెస్ పిసిసి కార్యనిర్వహన కార్యదర్శి జగన్ మోహన్ రెడ్డి, ఓబీసీ జిల్లా నాయకులు గాలి యాదవ్,  సీనియర్ నాయకులు రంగినేని జగదీశ్వర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాము యాదవ్ పరుశారాం ,మైనారిటీ సెల్ నాయకులు ముస్తాఫ్ఫా, మోజర్ల గోపాల్, టిడిపి మండల నాయకులు ఉడుత రామస్వామి కార్మికులకు ఆర్థిక సహాయం చేశారు. సిపిఎం నాయకులు ఈశ్వర్, శివ, శేఖర్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఏస్ఎండి ఫయాజ్ ఆర్టిసి కార్మికులకు మద్దతు తెలిపారు. ఎన్టీఆర్ చౌరాస్తాలో కార్మికులు మాట్లాడారు. ఆర్టీసీ ని ప్రభుత్వంలోవిలీనం చెయ్యలన్నారు. సిఎం కెసిఆర్ మొండి వైఖరి నశించాలన్నారు. కండక్టర్,డ్రైవర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఖాళీగా పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తెలంగాణ మాజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి రామయ్యా అన్నారు. సీఐ బి.వెంకట్ రెడ్డి, ఎసై కొంపల్లి మురళి గౌడ్ పాదచారులకు, వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు

Related posts

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సందర్శకులపై ఆంక్షలు

Satyam NEWS

వైసీపీతో ఎన్నికల అధికారుల కుమ్మక్కు పై భత్యాల ఆగ్రహం

Satyam NEWS

వలస కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం

Satyam NEWS

Leave a Comment