40.2 C
Hyderabad
April 24, 2024 15: 45 PM
Slider తెలంగాణ

నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ కు దర్శనం

ktr-voilated-rules-in-ttd.jpg January 7, 2020139 KB 620 by 413 pixels

వైకుంఠ ఏకాదశి రోజు నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ఉద్యోగులు ప్రవేశించే బయోమెట్రిక్ ద్వారా అనుమతించడంపై వివాదం రాజుకుంది.భక్తుల తో పాటు నాయకులు టి టి డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.అది కారులు రూల్స్ కు విరుద్ధంగా వ్యవరిస్తున్నారంటూ బీజేపీ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి.ఆరోపించారు.

వైకుంఠ ఏకాదశి రోజు నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ఉద్యోగులు ప్రవేశించే బయోమెట్రిక్ ద్వారా అనుమతించడంపై ప్రశ్నించారు. కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు, న్యాయమూర్తులు, సహా ప్రముఖులందరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండగా మంత్రి కేటీఆర్ ను మాత్రం మహాద్వారం ద్వారా ఎవరి ఆదేశాలతో అనుమతించారో రేపు ఉదయం లోపు శ్రీవారి భక్తులకు చెప్పాలని డిమాండ్ చేశారు.

శ్రీవారి ఆలయ సంప్రదాయాలును కాపాడవలసిన బాధ్యత సీఎంపై వుందన్నారు. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులును కంపార్టుమెంట్లలో వేచివుండేలా చేసి….కేటీఆర్ ను మాత్రం ముందుగానే ఆలయంలోకి ఎలా తీసుకువెళ్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిన్న(సోమవారం) వేకువజామున 12.30 గంటల నుండి 1.30 గంటల మధ్య ఆలయ ప్రవేశం చేసిన వారి వివరాలును వెల్లడించాలన్నారు. అంతేకాదు మంత్రి కేటీఆర్ కుంటుంబాన్ని బయోమెట్రిక్ ద్వారా ఆలయoలోకి వెళ్లే సి సి టి వి ఫుటేజ్ ను టి టి డి అధికారులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు .

ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారాలను తుంగలో తొక్కే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని అయన ఆరోపించారు.

Related posts

వివాదాస్పద న‌టి శ్రీ‌రెడ్డిపై మ‌రో ఫిర్యాదు

Satyam NEWS

రామ్ గోపాల్ వర్మ చిత్రంలో ఇక మిగిలింది 20 శాతమే

Satyam NEWS

శ్రీశైలంలో అంబరాన్ని అంటిన ఉగాది సంబరాలు

Satyam NEWS

Leave a Comment