30.7 C
Hyderabad
April 24, 2024 02: 49 AM
Slider తెలంగాణ ప్రత్యేకం

రద్దయిన పెద్దనోట్ల డంప్ ను పట్టుకున్న పోలీసులు

dump notes

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో రద్దయిన 500,1000 నోట్ల డంప్ ను పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల దొంగనోట్ల వ్యవహారం లో కీలకం గా వ్యవహరించిన సత్తుపల్లి మండలం గౌరీ గూడెం కు చెందిన మధార్ ముఠా కు చెందినదిగా ఈ  డంప్ ను పోలీసులు గుర్తించారు. కల్లూరు ఎసిపి వెంకటేష్ మీడియా సమావేశంలో చెప్పిన వివరాలు ఇవి. తమ వద్ద సుమారు 100 కోట్ల రూపాయల విలువ గల పాత నోట్లు ఉన్నాయని మధార్ ముఠా సభ్యులు చెప్పేవారట. వాటినే పెద్ద డంప్ గా ఏర్పాటు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అంతే కాకుండా నోట్ల కట్టల్లో పైనా కింద పాత 500,1000 నోట్లు, మధ్యలో చిత్తుకాగితాలు పెట్టి మోసాలకు పాల్పడేవారని పోలీసులు చెప్పారు. మధార్ ముఠా సభ్యులు మర్లపాడు గ్రామంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తామని ఇంటిని అద్దెకు తీసుకుని ఉండేవారని అక్కడ నుంచి నకిలీ నోట్లు చలామణి చేసేవారని పోలీసులు తెలిపారు. పాత నోట్లు,దొంగ నోట్లు మార్పిడికి మధార్ కు సహాయ పడుతున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వేంసూరు మండలం చౌడవరం గ్రామంకు చెందిన గాయం వెంకటనారాయణ, దమ్మపేట మండలం కు చెందిన గండుగులపల్లి గ్రామం వాస్తవ్యుడు కోట హనుమంతరావు పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఉన్నారు.

Related posts

ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా సీనియర్ జర్నలిస్ట్ వడ్డి ఓంప్రకాశ్

Satyam NEWS

ఇంటర్ నెట్ షట్ డౌన్ లో ప్రపంచంలోనే మనమే నెంబర్ వన్

Satyam NEWS

ఎమ్మెల్యే అభ్యర్ధులకు కొత్త టార్గెట్?

Bhavani

Leave a Comment