28.7 C
Hyderabad
April 20, 2024 04: 17 AM
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

జీవో కు విరుద్ధంగా రుణమాఫీ చెల్లింపులు

pjimage (11)

డబ్బులు కొట్టేయడానికి కూడా అన్ని రూల్సూ తెలిసి ఉండాలని నిరూపించారు ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ అధికారులు. రుణ మాఫీ కి సంబంధించి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ వేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన నిబంధనలు వేరు. రైతులకు సంబంధించిన అన్ని రకాల రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికలలో ప్రకటించిన చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే అడ్డగోలుగా నిబంధనలు పెట్టారు. ఈ మొత్తం నిబంధనలు ఆకళింపు చేసుకున్న అప్పటి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ముందుగా లొసుగులను పసిగట్టారు. రుణ మాఫీకి సంబంధించి 18 లక్షల అభ్యంతరాలు వచ్చిన విషయం సత్యం న్యూస్ ముందే చెప్పింది.

ఈ అభ్యంతరాలలో తమకు అనుకూలమైనవి పరిష్కరించేందుకు కుటుంబరావు అండ్ కంపెనీ ముందుకు వచ్చింది. కడప జిల్లాకు, ఒంగోలు జిల్లాకు చెందిన ఇద్దరు ఎం ఎల్ ఏలు చంద్రబాబు దాకా వెళ్లి రుణమాఫీలో తమకు కావాల్సిన వారికి ప్రభుత్వం డబ్బు చెల్లించే విధంగా వత్తిడి తీసుకువచ్చారు. తమ్ముళ్లకు పంచిపెట్టడమే తన కర్తవ్యం అయినట్లు చంద్రబాబునాయుడు వారి వినతిని కుటుంబరావుకు చెప్పారు. దాంతో స్వామి కార్యం స్వకార్యం కూడా పూర్తవుతుందని భావించిన కుటుంబరావు నిబంధనలను సడలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

అయితే ఇదెక్కడా కూడా ఫైలు పై కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సాఫ్ట్ వేర్ తో కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సొంత సాఫ్ట్ వేర్ తో రుణ మాఫీ అభ్యంతరాలను పరిష్కరించడం ప్రారంభించారు. ఇద్దరు ప్రజాప్రతినిధులు చేసిన వినతికి అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాలు లేవు. ప్రభుత్వ ఆదేశాలను సవరించుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే ప్రభుత్వ జీవోను సడలిస్తే అవే నిబంధనలు అందరికి వర్తిస్తాయి. అలా కాకుండా కేవలం ఇద్దరు ఎం ఎల్ ఏల కు ఫేవర్ చేసే విధంగా కుటుంబరావు కథ నడిపారు.

ఆ ఎం ఎల్ ఏ లు ఇద్దరే కొట్టేస్తే చూస్తూ కూర్చోడానికి మిగిలిన వారంతా చేతకాని వారు కాదు కదా? వారు కొట్టేసిన దాంట్లో తమ వాటా తమకు దక్కి ఉంటుంది. బంగారం రుణాలపై రుణ మాఫీ చేసేందుకు చాకచక్యంగా వ్యవహరించారు వీరంతా. రుణ మాఫీ డబ్బుల్ని కేవలం లోన్ ఎకౌంట్ల లోనే జమ చేయాలి. అయితే అలా చేయలేదు. ఇదే కుంభకోణం. రైతుల ఎస్ బి ఎకౌంట్ లో డబ్బులు వేసేశారు. ఎస్ బి ఎకౌంట్ లో డబ్బు వేయడం మార్గదర్శకాలకు విరుద్ధం. బంగారం రుణం ఉన్న వారికి రుణమాఫీ అమలు చేయరాదని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నా కూడా ఎస్ బి ఎకౌంట్లకు డబ్బులు వేసేశారు. క్రాప్ లోన్ తీసుకున్న రైతులను ఆధార్ తో అనుసంధానం చేసే ఎన్ ఐ సి సాఫ్ట్ వేర్ లో ఇలా చేయడానికి కుదరదు కాబట్టి సొంత సాఫ్ట్ వేర్ లో కుటుంబరావు అండ్ కంపెనీ చేసేశారు. ఫిర్యాదులు వచ్చిన 18 లక్షల ఎకౌంట్లలో చాలా వరకూ ఇలా ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఎస్ బి ఎకౌంట్లలో డబ్బలు వేసేశారు. (ఇంకా ఉంది)

Related posts

కోనసీమ జిల్లా కు కొత్త ఎస్పీ

Bhavani

రీమాండ్:నలుగురు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్

Satyam NEWS

ఇంజనీర్లను సన్మానించిన ములుగు లయన్స్ క్లబ్

Satyam NEWS

Leave a Comment