27.7 C
Hyderabad
April 24, 2024 08: 21 AM
Slider జాతీయం

ట్యాక్సీ డ్రైవర్ తో మహిళా ఎంపికి తీవ్ర అసౌకర్యం

supriya sule f

ముంబై రైల్వే స్టేషన్‌లో ఓ ట్యాక్సీ డ్రైవర్ నుంచి తనకు షాకింగ్ అనుభవం ఎదురైందని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) ఎంపీ సుప్రియా సూలే చెప్పారు. రైలు బోగిలోకి వచ్చిన ట్యాక్సీ డ్రైవర్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని తెలిపారు. తనను అడ్డగించడమే కాకుండా తాను వారిస్తున్నా వినకుండా తన ఫోటోలు తీశాడని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని రైల్వే స్టేషన్లలో ఏ మహిళకూ ఇలాంటి అనుభవం ఎదురు కావొద్దని ఆమె కోరారు. ‘నేను రైల్వే బోగీలో ఉండగా.. ఓ ట్యాక్సీ డ్రైవర్‌ వచ్చి ట్యాక్సీ కావాలా? అని అడిగాడు. వద్దని చెప్పినా వినిపించుకోకుండా మళ్లీ అదే ప్రశ్న వేస్తూ వేధించాడు. రెండుసార్లు నిరాకరించిన తర్వాత నన్ను అడ్డుకొని సిగ్గులేకుండా ఫోటోలు తీసుకున్నాడు’ అని ఎంపీ సుప్రీయా ట్వీట్ చేశారుతనను అడ్డగించిన ట్యాక్సీ డ్రైవర్‌ పేరు కుల్జీత్‌ సింగ్‌ మల్హోత్రా అని ఎంపీ సుప్రియా తెలిపారు. ట్యాక్సీ కోసం ప్రయాణికులను వేధించడానికి రైల్వే స్టేషన్లలో అనుమతి ఉందా అని అధికారులను ఉద్దేశించి ఎంపీ ప్రశ్నించారు. ఒకవేళ ఉంటే, దాన్ని ట్యాక్సీ స్టాండ్ వరకే పరిమితం చేయాలని రైలు బోగీలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ఇలాంటివి జరగకుండా చూడాలని సూచించారు.

Related posts

స్వామి శ్రీ రామానంద యోగజ్ఞానాశ్రమంలో “అపర వాల్మీకి” జయంతి…!

Bhavani

ఉప్పల్‌ లో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

Satyam NEWS

తెలంగాణ ముద్దు బిడ్డ

Satyam NEWS

Leave a Comment