31.2 C
Hyderabad
April 19, 2024 04: 28 AM
Slider ఆధ్యాత్మికం

త్రికోటేశ్వరనమహ: చేదుకో కోటయ్య ఆదుకో మమ్ము

kotappakonda

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

శివుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసిన తర్వాత శాంతించి పన్నెండేళ్ల బాలుడిగా మారి బ్రహ్మచర్య దీక్షతో కైలాసంలో సమాధి నిష్టలో దక్షిణామూర్తిగా ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ తదితర దేవతలు దక్షిణామూర్తి వద్దకు వెళ్లి తమకు బ్రహ్మోపదేశం చేయమని కోరారు. అందుకు అంగీకరించిన దక్షిణామూర్తి త్రికూటార్ధి (కోటప్పకొండ) కి వచ్చి వారికి బ్రహ్మోపదేశం చేశాడు. కనుకనే కోటప్పకొండ మహా పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతున్నది.

గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలో ఉన్న కోటప్పకొండ త్రికూటేశ్వర స్వామి ఆలయంలో నిత్యం అభిషేకాలు, పూజలు, హోమాలూ జరుగుతుంటాయి. కార్తీక మాసంలో శివారాధన చాలా విశిష్టం అందువల్ల కార్తీకమాసంలో కోటప్ప కొండలో విశేష పూజలు నిర్వహిస్తుంటారు.

మహాశివరాత్రి పర్వదినం నాడు కోటప్పకొండ దర్శనం సకల పాపాలనూ హరిస్తుంది. కోటప్పకొండకు సమీపంలో గల యల్లమంద గ్రామం నుంచి బ్రహ్మ శిఖరంలో ఉన్న త్రికోటేశ్వరుడికి ఆనందవల్లి అనే గొల్లభామ నిత్యం పాలు తీసుకుని వెళుతూ ఉండేది. ఒకానొక సమయంలో గర్భవతిగా ఉన్న ఆ గొల్లభామ ‘స్వామి కొండపైకి రావడానికి ఇబ్బందిగా ఉంది నీవే కొండ కిందికి వచ్చి పాలు తీసుకుని వెళ్లు’ అని ప్రార్థించింది.

మహేశ్వరుడు గొల్లభామతో ‘ నీవు వెనుదిరిగి చూడకుండా వెళుతూ ఉండు నేను నీవెనుకే వస్తుంటాను అని చెప్పాడు. గొల్లభామ కిందికి వస్తున్న సమయంలో వెనుక నుండి పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో భయంతో వెనుతిరిగిది తక్షణమే వెనుకున్న శివుడు లింగాకృతి లోకి వెళ్లిపోయాడు.

గొల్లభామ శిలావిగ్రహంగా మారిపోయింది. పరమ భక్తురాలైన గొల్ల భామను దర్శించిన తర్వాతనే కోటప్ప కొండలో శివ దర్శనం చేసుకునే సాంప్రదాయం ఉన్నది. పాత కోటేశ్వర స్వామి ఆలయం రుద్ర శిఖరంపైన ఉంది. దక్షిణామైర్తి తపం ఆచరించిన స్థలం అదే. ఇక్కడ నుంచి అర్ధ్రోత్సవం నాడు జ్యోతి దర్శనం అవుతుంది.

పాప విమోచనేశ్వరర స్వామి ఆలయ శివ రహితంగా జరిగిన దక్ష  యజ్ఞం లో పాల్గొన్న దేవతలు రుషులు పాప విమోచనం పొందిన స్థలం బొచ్చు కోటయ్య స్వామి ఆలయం. ఇది కొండ కింద ఉంటుంది. ఇక్కడ భక్తులు తలనీనాలు సమర్పిస్తారు. వరసిద్ధి గణపతి ఆలయం మెట్ల మార్గం మొదటిలో ఉంటుంది. నరసరాపుపేట మండలంలోని కోటప్ప కొండ పుణ్యక్షేత్రం పర్యాటక కేంద్రం గా కూడా అసాధారణ రీతిలో అభివృద్ధి చెందింది.

హర హర మహదేవ చేదుకో కోటయ్య అని భక్తి సమ్మిళిత ఆర్తితో పిలవగానే కాలకూటం లాంటి పాపాను హరించి ఇహపర సౌఖ్యాలను అందించే ప్రత్యక్ష దైవం త్రికోటేశ్వర స్వామి. ఎందరో దేవతామూర్తులకు జ్ఞానాన్ని ప్రసాదించిన కేంద్ర కోటప్పకొండ. అందుకే మహా శివరాత్రి పర్వదినం నాడు త్రికోటేశ్వర స్వామి దర్శనం సర్వపాపాలనూ కడిగేస్తుంది. శివోహం.

ములకలూరి సుధాకర్

Related posts

మాజీ ఎంపీ పొంగులేటిపై బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు

Bhavani

పేదవారికి నిత్యావసరాలు పంచిన మార్కండేయ సేవా సమితి

Satyam NEWS

పెంపుడు కుక్కలకు గుర్తింపు కార్డులు

Murali Krishna

Leave a Comment