39.2 C
Hyderabad
March 29, 2024 16: 32 PM
Slider హైదరాబాద్

మేల్ యానిమల్స్: అత్యంత కిరాతకంగా బాలిక హత్య

girl rape

హైదరాబాద్ లోని చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వారాసిగూడలో దారుణం జరిగింది. ప్రపంచం మొత్తం సేవ్ గర్ల్ ఛైల్డ్ అని నినాదాలు చేస్తున్న సమయంలో ఇక్కడ ఒక బాలికను ఎవరో హతమార్చారు. 17 సంవత్సరాల వయసు ఉన్న ఇర్ఫానా అనే బాలికను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. బాలిక నివాసం ఉంటున్న భవనంపై రక్తపు మరకలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు పెద్ద అపార్ట్‌మెంట్ల మధ్యలో ఈ బాలిక మృతదేహం లభ్యమైంది.  ఘటనాస్థలికి చేరుకున్న క్లూస్‌ టీం ఆధారాలు సేకరిస్తోంది. బాలిక మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్ని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. హత్యచేసి అపార్ట్‌మెంట్ పై నుంచి మృతదేహాన్ని పడేసినట్టుగా అనుమానిస్తున్నారు. బాలికపై అత్యాచారం కూడా జరిగిందనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

Related posts

ఫేక్ న్యూస్: కరోనా వైరస్‌ వదంతులు నమ్మెద్దు

Satyam NEWS

అత్యాచారం చేసే కామాంధులను బహిరంగంగా ఉరి తీయాలి

Satyam NEWS

ప్రశాంతంగా గ్రూప్ -1 పరీక్ష

Satyam NEWS

Leave a Comment