27.7 C
Hyderabad
April 19, 2024 23: 54 PM
Slider సినిమా

పసుపులేటి రామారావు కుటుంబానికి అండగా ఉంటా

pasupuleti

సీనియర్ సినిమా జర్నలిస్టు పసుపులేటి రామారావు మృతిచెందిన విషయం తెలిసి మెగాస్టార్ చిరంజీవి తీవ్రదిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. రామారావు తనకు ఆత్మబంధువని, సీనియర్ జర్నలిస్టు అనే కాకుండా ఆయన వ్యక్తిత్వం తనకెంతో ఇష్టమని చిరంజీవి అన్నారు. రామారావు గురించి ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే ‘‘ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, నడవలేకపోతున్నారని తెలిసి సన్ షైన్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ గురవారెడ్డి దగ్గరికి పంపించాను.

 మోకాళ్ల ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. తన అక్కయ్యగకి బాగోలేదని, ఆమె కోలుకున్నాక ఆపరేషన్ చేయించుకుంటానని రామారావు అన్నారు. నేనంటే అతనికి ఎంతో అభిమానం, అతనన్నా నాకంతే అభిమానం. లేకలేక పుట్టిన అతని కుమారుడికి మా ముగ్గురు అన్నదమ్ముల పేర్లు కలిసి వచ్చేలా  పేరు పెట్టాడు.

ఆ కుర్రాడి పేరు చిరంజీవి నాగ పవన్ అనుకుంటాను. నేనతన్ని కేవలం ఒక జర్నలిస్టుగానే చూడను. నీతికీ నిజాయితీకీ నిబద్దతకూ మరోరూపంలా చూస్తుంటాను. అతని కుటుంబానికి నేను అన్నిరకాలుగా అండగా ఉంటాను, వాళ్ల కుటుంబం బాగోగులను చూసుకుంటాను.

 ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ అంటూ చిరంజీవి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం మృతిచెందిన సీనియర్ సినిమా జర్నలిస్టు పసుపులేటి రామారావు భౌతిక కాయం వద్ద మెగాస్టార్ చిరంజీవి పూలమాల ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు.

రామారావు భార్య వెంకటలక్ష్మి, కుమారుడు కళ్యాణ్ నాగ చిరంజీవి ని పరామర్శించారు. రామారావు పార్థివ దేహం మధ్యాహ్నం హైదరాబాద్ ఇందిరానగర్ లోని ఇంటికి చేరగానే చిరంజీవి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.  సినీప్రముఖులు  ఎస్.వి. కృష్ణా రెడ్డి, అచ్చిరెడ్డి, బీవీఎస్ఎన్ ప్రసాద్, మాదాల రవి. సి.వి. రెడ్డి తదితరులు కూడా అక్కడికి చేరుకుని రామారావు భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. రామారావు భౌతికకాయానికి ఎఫ్ ఎన్ ఏ ఈ ఎం అసోసియేషన్ ప్రతినిధులు కూడా నివాళి అర్పించారు.

Related posts

బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ

Bhavani

వ్యతిరేక తీర్పులు వస్తున్న నేపథ్యంలో…ఇలా..

Satyam NEWS

కేసీఆర్ ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం

Satyam NEWS

Leave a Comment