Slider తెలంగాణ ముఖ్యంశాలు

ప్రభాస్ మద్దతు కు కేటిఆర్ కృతజ్ఞతలు

prabhas ktr

ప్రముఖ సినీ హీరో ప్రభాస్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావుకు  మద్దతు తెలిపారు. హీరో ప్రభాస్ మద్దతు తెలిపినందుకు కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు జ్వరాలతో బాధపడుతున్న నేపథ్యంలో మంత్రి కేటిఆర్ ట్విట్టర్ వేదికగా  ‘వైరల్ జ్వరాలు, డెంగ్యూ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మీ ఇంటి ఆవరణలో ఉన్న నీటి తొట్టెలు, పూల కుండీలు, ఎయిర్ కులర్లలో నీటి నిల్వ లేకుండా చూసుకోండి..దోమల వ్యాప్తికి ఇవే కారణం. నా ఇంటి పరిసరాలను నేను తనిఖీ చేసి నిల్వ ఉన్న నీటిని తొలగించాం. మీరు కూడా ఆ పనిచేసి ఫొటోలను నాతో పంచుకోండి’ అని ట్వీట్ చేశారు.  మంత్రి కేటిఆర్ కి యువ కథానాయకుడు ప్రభాస్ ట్విట్టర్ వేదికగా మద్దతు తెలిపారు. కేటిఆర్ తన ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తున్న ఫొటోలను ప్రభాస్ తిరిగి పంచుకుంటూ ‘వైరల్ జ్వరాలు, డెంగ్యూ రాకుండా మీ ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోండి. దయచేసి ఈ విసయాన్ని అందరికీ చేరేలా చూడండి. ఆరోగ్యంగా ఉండండి అని పేర్కొన్నారు. హీరో ప్రభాస్ మద్దతు తెలిపినందుకు కేటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

తిరుమల తిరుపతి పాలకమండలి పై తాజా నిర్ణయం

Satyam NEWS

9న కొప్పరపు కవుల కళాపీఠం మహాసభ

Satyam NEWS

తెల౦గాణ‌ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా వెంకటేశ్వర్

Satyam NEWS

Leave a Comment