28.7 C
Hyderabad
April 17, 2024 03: 09 AM
Slider ముఖ్యంశాలు

మోజో టివి సిబ్బందికి తీరని మోసం

pjimage (3)

ఆవిర్భవించిన అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న మోజో టీవీ మూతపడేందుకు సిద్ధంగా ఉంది. మీడియా ఎన్ ఎక్స్ టి ఇండియా కంపెనీ నడిపే మోజో టివి అప్పటిలో టివి9 రవిప్రకాశ్ చొరవతో ప్రారంభం అయింది. టివి9ను టేకోవర్ చేసిన అలందా మీడియాతో వాటాల విషయంలో టివి9 అప్పటి సిఇవో రవిప్రకాశ్ కు విభేదాలు వచ్చాయి. ఈ విభేదాలు చినికి చినికి గాలివానగా మారినట్లు రవిప్రకాశ్ ను అరెస్టు చేయించేందుకు కొత్త యాజమాన్యం విశేష ప్రయత్నం చేసింది. టివి9 లోగో తదితర అంశాలలో విభేదాలు రచ్చకెక్కడంతో రవి ప్రకాశ్ పై కక్షగట్టి మరీ కొత్త యాజమాన్యం పలు రకాల కేసులు బనాయించింది. ఈ నేపథ్యంలో రవి ప్రకాశ్ చొరవతో ప్రారంభం అయిన మోజో టీవీ ని టివి9 డబ్బులతోనే ప్రారంభించారని చెబుతూ కొత్త యాజమాన్యం అక్కడ పని చేస్తున్న సి ఇ వో రేవతి ని బయటకు వెళ్లగొట్టి నానా రభస చేశారు. మోజో టీవీని మై హోం రామేశ్వరరావు తదితరులకు సంబంధించిన కంపెనీల వారు తమ ఆధీనంలోకి తీసుకుంటున్న సమయంలో అప్పటి మోజో టీవీ సీఈఓ రేవతి స్టూడియో లోనే నిరాహారదీక్ష చేసారు. మోజో లో పనిచేస్తున్న ఉద్యోగుల జీవితాలతో రామేశ్వర్ రావు అడుకుంటున్నారని ఉద్యోగుల తరుపున ఆమె ఫైట్ చేశారు. ఈ సందర్భంలో రేవతి కుటుంబ సభ్యులను పోలీస్ లతో బెదిరించారు. ఆమె పై అక్రమ కేసులు పెట్టి ఒక మహిళ అని కూడా చూడకుండా పోలీస్ లు ఆమె ఇంటి పై దాడి చేసి బలవంతంగా ఈడ్చుకెళ్లి 10 రోజులు జైల్ లో పెట్టారని మోజో టివి ఉద్యోగులు చెబుతున్నారు. ఇలా రేవతిని వెళ్లగొట్టి అక్కడి సిబ్బందిని వేధించి ఇప్పుడు మోజో టివిని మూసి వేస్తున్నట్లుగా యాజమాన్యం ప్రకటించింది. మోజోటివి ఉద్యోగులు రోడ్డున పడబోతున్న సందర్భంలో మోజో టీవీ ఉద్యోగులు, జర్నలిస్టులకు TWJF సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మోజో టీవీ మూసివేస్తాం అన్న యాజమాన్యం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం,  వందలమంది ఉద్యోగుల జీవితాలను రోడ్డున పడేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.  ఉద్యోగాల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం .లేనిపక్షంలో జర్నలిస్టులమంతా ఐక్యపోరాటం చేస్తాం అని TWJF అధ్యక్షుడు ఎం సోమయ్య, , ప్రధాన కార్యదర్శి బి బసవపున్నయ్య ఒక ప్రకటనలో హెచ్చరించారు.

Related posts

కేంద్ర ప్రభుత్వం తక్షణం నాలుగు లేబర్ కోడ్ లు ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

రైతు సమస్యలపై నెల్లూరు కలెక్టరేట్ ఎదుట బీజేపీ ధర్నా

Satyam NEWS

రండి రండి ప్లవ గారూ!

Satyam NEWS

Leave a Comment