37.2 C
Hyderabad
April 18, 2024 20: 59 PM
Slider ఆదిలాబాద్

మదర్ టంగ్: మాతృభాషతో సంపూర్ణ మానసిక వికాసం

mother tounge

భాష పై పట్టు సాధిస్తే సంపూర్ణ మానసిక వికాసం లభిస్తుందని AO ఆచార్య రాజేశ్వర్ రావు అన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలను విశ్వ విద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తెలుగుశాఖ అధ్యక్షులు డా.విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో  మాట్లాడుతూ మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాషపై ప్రతి ఒక్కరికి  ప్రేమ ఉండాలని,ప్రతి మనిషికి మాతృభాష ప్రాణంతో సమానం అని, మాతృభాష మరణిస్తే జాతి నీతి సంస్కృతి  మరణించినట్లు అని తెలిపారు.

అసోషియేట్ డీన్ శేఖర్ శీలం మాట్లాడుతూ భాష గొప్పదనాన్ని నేటితరం, భవిష్యత్ తరాల వారికి తెలియజేయాలని మాతృభాషను మాతృభూమిని గౌరవించాలి అని అన్నారు.  అనంతరం విద్యార్థులకు భాషాపరమైన అంశాలలో వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డా.గోపాలకృష్ణ,డా.రమాదేవి, రాములు డా.సుమన్, డా.రాయమల్లు, ముత్యం తదితరులు పాల్గొన్నారు.

Related posts

టిడిపి అధికారంలోకి వస్తే సంక్షేమం ఆగిపోతుంది

Satyam NEWS

పూరీ జగన్నాధ రథయాత్రకు సర్వం సిద్ధం

Satyam NEWS

టిటిడి ఉద్యోగుల జాతీయ స‌మ‌గ్ర‌తా ప్ర‌తిజ్ఞ‌

Satyam NEWS

Leave a Comment