39.2 C
Hyderabad
March 29, 2024 13: 56 PM
Slider సంపాదకీయం

కరోనా కల్ప్రిట్: ఇంకా పరారీలోనే మర్కజ్ మసీదు చీఫ్?

moulana saad

ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ మసీదు చీఫ్ మౌలానా సాద్ ఎక్కడ ఉన్నాడు? ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన నాటి నుంచి పరారీలో ఉన్న మౌలానా సాద్ ఇప్పటికీ దొరకలేదు.

మర్కజ్ మసీదులో తబ్లిగీ జమాత్ నిర్వహించిన కార్యక్రమంలో కరోనాపై ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని మౌలానా సాద్  చెప్పిన ఆడియో క్లిప్ ఢిల్లీ పోలీసులకు లభ్యం కావడంతో అతడిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

అతడితో బాటు జీషాన్, ముఫ్తీ షెహజాద్, ఎం సైఫ్, యూనస్, మహ్మద్ సల్మాన్, మహ్మద్ అష్రాఫ్ అనే ఆరుగురిపై కూడా ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేశారు. మౌలానా సాద్ కోసం ఢిల్లీలోని పలు ప్రాంతాలను జల్లెడ పట్టారు. ఉత్తరప్రదేశ్ లోని అతని సొంత ఊళ్లో కూడా తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు కానీ అతడు ఇప్పడి వరకూ దొరకలేదు.

 తబ్లిగీ జమాత్ ను అనుసరించే దాదాపు 2000 మంది సున్నీ ముస్లింలు ఈ సదస్సుకు హాజరయ్యారు వారిలో దాదాపు 41 మంది విదేశీయులు ఉన్నారు. అక్కడ నుంచి మతబోధనల అనంతర దేశంలోని వివిధ ప్రాంతాలకు విదేశీయులతో కలిసి తబ్లిగీ జమాత్ అనుచరులు వెళ్లారు.

కరోనా వ్యాధి సోకిన వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాలకు చేరడంతో దేశంలో కరోనా పాజిటీవ్ కేసులు ఒక్క సారిగా పెరిగిపోయాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోకపోవడం తో ఇప్పటి వరకూ తబ్లిగీ జమాత్ కు వెళ్లి వచ్చిన వారిని అందరిని వివిధ రాష్ట్రాల పోలీసులు పట్టుకోలేకపోయారు.

తబ్లిగీ జమాత్ కు హాజరైన వారితో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలలో కోవిడ్ 19 కేసులు కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్నాయి. మర్కజ్ మసీదు చీఫ్ మౌలానా సాద్ పైనా మరో 6 గురు నిర్వాహకులపైన పోలీసులు కేసులు పెట్టారు కానీ ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు.

కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అయిన తబ్లిగీ జమాత్ పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. మౌలానా సూద్ సమాధానాలు చెబితేనే చాలా విషయాలకు పరిష్కారం దొరుకుతుంది. విదేశాల నుంచి అతిధులను ఎందుకు పిలిచారు? వారిని ఎక్కడకు పంపారు అనే వివరాలు ఇప్పుడు ఎంతో అవసరం.

అయితే మౌలానా సూద్ మాత్రం పోలీసులకు దొరకలేదు. గత మూడు రోజులుగా రెండు వేల మందిని మర్కజ్ మసీదు నుంచి బయటకు పంపారు. గత శనివారం నాడు కనిపించిన మౌలానా సాద్ ఆ తర్వాత ఎవరికి కనిపించలేదు. ఢిల్లీ మర్కజ్ అనే ఒక యూట్యూబ్ ఛానెల్ ఒక వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో మర్కజ్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని సోషల్ డిస్టెన్సింగ్ అనేది అర్ధం లేని విషయమని వారు తెలిపారు. సాటి ముస్లింల నుంచి దూరంగా ఉంచేందుకు కరోనా వైరస్ పేరుతో కుట్ర పన్నుతున్నారని వారు ఆ వీడియోలో చెప్పారు.

Related posts

క్లీన్ విలేజ్: 29 తేదీ లోగా ప్రతి గ్రామంలో చెత్తను తొలగించాలి

Satyam NEWS

షరతులు లేని చర్చలకు రైతులను ఆహ్వానించాలి

Satyam NEWS

ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు వెంటనే చేపట్టాలి

Satyam NEWS

Leave a Comment