39.2 C
Hyderabad
March 29, 2024 15: 19 PM
Slider శ్రీకాకుళం

మురికి నీటితో నిండిపోతున్న నాగావళి నది

Nagavali River

శ్రీకాకుళం పట్టణం మధ్యలో మురికి నీటితో  ప్రవహిస్తున్న నాగావళి నదిని శ్రీకాకుళం పట్టణ కార్పొరేషన్, శానిటేషన్, ఆరోగ్యశాఖ, అధికారులు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణం ప్రజలు ఇంటిలోవాడుక మురికి నీటిని అనేక కాలువల ద్వారా శ్రీకాకుళం నదిలో కలుపుతున్నారు.

దీంతో నాగావళి నది పూర్తిగా కాలుష్యంతో నిండిపోయి ఉంది. ఈ నీటిని అంతంత మాత్రంగా  శుద్ధి చేస్తున్నారు. దీనివల్ల పట్టణ ప్రజలు జబ్బుల బారిన పడుతున్నారు. తెలుగుదేశం హయాంలో కోడి రామ్మూర్తి క్రీడా ప్రాంగణం ఆనుకొని, కలెక్టర్ కార్యాలయం దగ్గర, వాంబే కాలనీ వెనకాల కొన్ని లక్షల రూపాయలతో మురికి నీటిని శుద్ధి చేసే బావులను యుద్ధ ప్రాతిపదికన నిర్మించారు.

పట్టణంలోని మురికినీటిని శుభ్రపరిచి నాగావళి నదిలో పంపించడం కోసం వాటిని ఏర్పాటు చేశారు. అయితే ఇంతలో ప్రభుత్వం మారటంతో ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు. ఇప్పటికే పట్టణ ప్రాంత కరోనా వైరస్ తో భయపడుతుండగా ఇప్పుడు ఈ మురికి నీటి వల్ల మరేం జబ్బులు వస్తాయోనని భయపడుతున్నారు.

Related posts

అనుమానాస్పద వ్యక్తుల పట్టివేత

Satyam NEWS

మఠాష్: 60 లక్షల రూపాయల గుట్కా దగ్ధం

Satyam NEWS

పెండింగ్‌ పనులను సకాలంలో పూర్తి చేయండి

Satyam NEWS

Leave a Comment