39.2 C
Hyderabad
March 29, 2024 16: 49 PM
Slider ముఖ్యంశాలు

సర్ సీ వీ రామన్ కు ఎన్ని పురస్కారాలు వచ్చాయో తెలుసా?

c v raman photo

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

వైజ్ఞానిక రంగంలో తొలి నోబెల్ బహుమతి పొందిన ఘనుడు సర్ సీ వీ రామన్. దేశంలో రెండవ నోబెల్ పొందిన శాస్త్రవేత్త ఆయన. అంతేకాదు ప్రతిష్టాత్మక భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కెరటం ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే వైజ్ఞానిక శాస్త్రానికే తలమానికం సర్ సీ వీ రామన్. ఆ మహనీయుడిని తలచుకునే రోజు ఇది.

తమిళనాడులోని తిరుచురాపల్లిలో 1888 నవంబరు 7న చంద్రశేఖర్ వెంకట రామన్ జన్మించారు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్, తల్లి పార్వతి అమ్మాళ్. వారిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి విశాఖపట్నంలోని ఏవీఎన్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేయడం వల్ల రామన్ బాల్యం, విద్యాభ్యాసం విశాఖలోనే జరిగింది.

రామన్ తన 13 వ ఏట ప్రెసిడెన్సీ కాలేజీలో 1902 లో ప్రవేశించి, 1904 లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణుడై బంగారు పతకం పొందాడు. 1907 లో అదే కాలేజీ నుండి యం.ఏ. డిగ్రీని ఫిజిక్స్ లో డిస్టింక్షన్ పొందరు. రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన రోజును మనం జాతీయ సైన్స్ డేగా జరుపుకుంటున్నాం.

1927 సంవత్సరం భౌతిక శాస్త్రంలో కాంప్టన్ నోబెల్ బహుమతి పొందినప్పుడు రామన్ లో సరికొత్త ఆశలను రేకెత్తాయి. కాంప్టన్ ఫలితం ఎక్సరే విషయంలో నిజమైనపుడు, కాంతి విషయాలలో నిజం కావాలి కదా అనే ఆలోచనలో పడ్డారు. ఆ ఆలోచనే రామన్ ఎఫెక్టుకు దారితీసింది.

తగినంత అధునాతనమైన పరికరాల్లేకపోయినా, రామన్ తన ఆలోచనకు ప్రయోగ రూపంలో జవాబు లభిస్తుందని నమ్మకంతోనే విజయం వైపు అడుగులు వేశారు. సూర్యుని నుంచి వెలువడే తెలుపు వర్ణపు కాంతి వాయువులోని అణువులపై పడి, వాటి ప్రయాణ దిశను మార్చుకుంటాయని తన పరిశోధనల ద్వారా తెలుసుకున్న సి.వి. రామన్ ఓ సిద్ధాంతాన్ని సూత్రీకరించాడు.

వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరివర్తనం చెందుతుందని 1928 సంవత్సరం, ఫిబ్రవరి 28న రామన్ మొట్టమొదటిసారి ప్రకటించారు. అదే నేడు. ఇంతకీ భారతరత్న సీ వీ రామన్ ఎన్ని పురస్కారాలు పొందారో తెలుసా? లెక్కలేనన్ని. ఫిజిక్సులో నోబెల్ బహుమతి పొందిన సర్ సీ వీ రామన్ ను బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్‌హుడ్ బిరుదుతో సత్కరించింది.

1930లో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. 1954లో ‘భారతరత్న’ అవార్డు ఇచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది. రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ వారు హ్యూస్ మెడల్ ఇచ్చి సర్ సీ వీ రామన్ ను సత్కరించారు. రష్యా కు చెందిన లెనిన్ శాంతి బహుమతి కూడా 1957 రామన్ పొందారు.

బ్రిటీష్ వారు ఇచ్చే గౌరవ పురస్కరమైన నైట్స్ బ్యాచిలర్ హోదాను కూడా సీ వీ రామన్ పొందారు. ఇటలీ కి చెందిన మట్టూస్చి మెడల్ ను కూడా రామన్ పొందారు. ఈ మెడల్ ను ఫిజిక్స్ లో గణనీయమైన పరిశోధనలు చేసిన వారికి అందచేస్తారు. ఇటాలియన్ రాయల్ డిగ్రీ వారు ఈ అవార్డును అందచేయడం ఆనవాయితీగా వస్తున్నది.

1915లో ప్రవేశపెట్టిన ఫ్రాంక్లిన్ మెడల్ ను కూడా రామన్ పొందారు. అమెరికాలోని ఫిలడెల్ఫియా లో ఉండే ఫ్రాంక్లిన్ ఇన్ స్టిట్యూట్ వారు ఈ మెడల్ ను ఇస్తారు. అలాంటి ప్రతిష్టాత్మక ఫ్రాంక్లిన్ మెడల్ ను సర్ సీ వీ రామన్ పొందారు. ప్రముఖ శాస్త్రవేత్తలకు ఇచ్చే రాయల్ ఫెలోషిప్ అవార్డును కూడా ఆయన పొందారు.

ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో వెల్లడించిన వ్యక్తిల్లో సర్ సీవి రామన్ మొదటి వ్యక్తి. అఖండ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన రామన్ కు ఎన్నో గౌరవ డాక్టరేట్లు లభించాయి. 1924 లో ఇంగ్లండ్ రాయల్ సొసైటీ సభ్యుడయ్యాడు. 1928 లో రామన్ కు సర్ బిరుదు దక్కింది.

1947 లో ప్రతిష్ఠాత్మకమైన ఫ్రాంక్లిన్ మెడల్ లభించింది. మనకి స్వాతంత్య్రం రాగానే రామన్ కు మొట్టమొదటి నేషనల్ ప్రొఫెసర్ గా ప్రభుత్వం నియమించి గౌరవించింది. 1948 లో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డైరెక్టర్ గా రిటైరయ్యారు.

దృష్టి, కాంతి, ధ్వని, వర్ణాలు, ద్రవాల తలతన్యత, ఖనిజాలు, డైమండ్, క్రిస్టల్ తదితర అంశాలపై పరిశోధనలు జరిపిన సీ వీ రామన్ సుమారు 465 పరిశోధన పత్రాలను వెలువరించారు. వాటిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరు వారు సేకరించి భద్రపరిచారు. 1949 లో బెంగుళూరులో రామన్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ స్థాపించి, 1970 నవంబరు 27 న ఆయన మరణించే వరకూ, ఆ సంస్థలో పరిశోధనలు జరిపి, మన దేశంలో సైన్సు అభివృద్ధికి మార్గదర్శకులయ్యారు. 1971 నవంబర్ 21 న సి.వి. రామన్ పోస్టేజి స్టాంపును భారత ప్రభుత్వం వెలువరించి ఆ మహా శాస్త్రజ్ఞుడిని గౌరవించింది.

Related posts

దార్శనికుడు, సంస్కరణలకు ఆద్యుడు పివి నరసింహారావు

Satyam NEWS

కచ్చితంగా నచ్చే ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ “ఏ చోట నువ్వున్నా”

Satyam NEWS

ఖమ్మంలో బంగారం వ్యాపారి నిలువు దోపిడి

Satyam NEWS

Leave a Comment