27.7 C
Hyderabad
April 26, 2024 04: 56 AM
Slider ముఖ్యంశాలు

లెజెండ్స్: మహా మహితాత్ములు మన శాస్త్రవేత్తలు

scientists

పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు మాధ్యమం గుండా కాంతిని ప్రసరింప చేసినప్పుడు అది తన పరివర్తను మార్చుకుంటుంది. ఈ విషయాన్ని 1928 మార్చి 16 న బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో సీ వీ రామన్ నిరూపించారు. దీనికి బ్రిటీష్ ప్రభుత్వం 1929లో నైట్‌హుడ్ బిరుదుతో సత్కరించింది.

దీనికి రామన్ ఎఫెక్టు అని పేరు పెట్టారు. 200 రూపాయల ధర కూడా ఉండని అతి సాధారణమైన పరికరాలతో సీ వీ రామన్ ఈ అద్భుతాన్ని కనిపెట్టి ప్రపంచ గమనాన్ని నిర్దేశించారు. దీన్ని అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ రామన్‌ను అభినందించారు. ఈయన పరిశోధన విలువను గుర్తించి 1930లో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు.

ఆ మహనీయుని సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 1954లో ‘భారతరత్న’ అవార్డు బహుకరించిన సమయంలో ఆయన మాట్లాడుతూ ‘విజ్ఞాన శాస్త్ర సారాంశం, ప్రయోగశాలల పరికరాలతో వికసించదు. నిరంతర పరిశోధన, స్వతంత్రంగా ఆలోచించే ప్రవృత్తి ఇవే విజ్ఞానశాస్త్ర సాగరాన్ని మధించి వేస్తాయి’ అన్న మాటలు నేటికి ఆలోచింపచేసేవి. జీవితం చివరి వరకు భారతదేశంలో సైన్స్ అభివృద్ధికై పాటుపడ్డ ఆ మహనీయుడు 1970 నవంబర్ 20 న భౌతికంగా కన్నుమూసినా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించుకొని ఆయనను చిరంజీవిగా మనమధ్యే నిలిపేలా చేసుకుంటున్నాం.

భారతరత్న సీ వీ రామన్ 1928లో ఫిబ్రవరి 28న కనుగొన్న రామన్ ఎఫెక్టును సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ విజ్ఞాన దినోత్సవంగా (నేషనల్ సైన్స్ డే) జరుపుకుంటున్నాం. ఆయనతో బాటు మన దేశం ఈ ప్రపంచానికి అందించిన మహానుభావులను ఈ సందర్భంగా స్మరించుకోవడం మన విధి. అందుకే మహనీయుల జీవితాన్ని సంక్షిప్తంగా మీకు అందిస్తున్నాం. ముందుగా శ్రీనివాస రామానుజన్ ను స్మరించుకుందాం.

శ్రీనివాస రామానుజన్ అనే భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు స్వతంత్రంగా గాస్, కుమ్మేర్, హైపర్ రేఖాగణిత సిరీస్ లను కనిపెట్టారు. సంఖ్య సిద్ధాంతం పై రచనలు చేసారు. 20 వ శతాబ్దపు అత్యుత్తమ గణిత శాస్త్రవేత్తగా గుర్తింపు పొందారు.

 మరో ప్రసిద్ధ విద్యావేత్త, రసాయన శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు అయిన ప్రఫుల్ల చంద్ర రాయ్ మొదటి భారతీయ ఔషధ సంస్థ, బెంగాల్ కెమికల్స్ & ఫార్మాస్యూటికల్స్ ఏర్పాటు చేసారు. భారతీయ రసాయన శాస్త్రవేత్త, వ్యాపారవేత్తగా అయన ప్రసిద్ధి చెందారు. అంతేకాక కెమిస్ట్రీ రాయల్ సొసైటీ వారిచే జీవిత పురస్కారాన్ని పొందారు. మొట్ట మొదటగా యూరోప్ బయట నుండి ఒక రసాయన ల్యాండ్ మార్క్ ప్లాక్ గా గుర్తింపు పొందారు.

కర్నాటక చెందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య, మైసూర్ లో కావేరి నదిపై కృష్ణ రాజ సాగర్ ఆనకట్టను నిర్మించిన ఒక ఇంజనీరు. ఆయన గౌరవార్ధం, ప్రతి సంవత్సరం అయన పుట్టినరోజు సెప్టెంబర్ 15 న ఇంజినీర్స్ డే గా జరుపుకుంటున్నాం. ఆయనకు 1955 వ సంవత్సరంలో భారతరత్న అవార్డు లభించింది.

 మరో భౌతిక శాస్త్రవేత్త  హోమీ జహంగీర్ భాభా. హోమీ భాభా ఒక సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్, భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ స్థాపించడంలో ప్రముఖ పాత్రను పోషించారు. అయన భారతీయ అణు శక్తి చీఫ్ ఆర్కిటెక్ట్ గా ఉన్నారు.

మరో మహానుభావుడు జగదీష్ చంద్ర బోస్. బెంగాలీ భౌతిక శాస్త్రవేత్త, జీవశాస్త్రజ్ఞుడు, వృక్షశాస్త్రజ్ఞుడు, పురాతత్వవేత్త. జే సీ బోస్ రేడియో, మైక్రోవేవ్ ఆప్టిక్స్ రంగంలో వివిధ అధ్యయనాలను కనుగొన్నారు. అయన జంతువులు, మొక్కలు వివిధ పరిస్థితుల్లో ఎలా ఉంటాయో తెలుసుకోవటానికి ‘క్రెస్కోగ్రాఫ్’ అనే పరికరాన్ని కనుగొన్నారు.

మరో మహానుభావుడు సలీం ఆలీ. పక్షుల అధ్యయనం, వాటిని వర్గీకరించడంలో అపారమైన ఆసక్తి కలిగిన ఒక భారతీయ పక్షి శాస్త్రవేత్త. ఆయన దేశం అంతటా క్రమబద్ధమైన పక్షి సర్వేలు నిర్వహించిన మొదటి భారతీయుడు. సలీం ఆలీని “భారతదేశం బర్డ్ మెన్ ” గా పిలిచేవారు. మరో మహానుభావులు సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. ఆయన భారత ఖగోళభౌతిక శాస్త్రవేత్త. నక్షత్రాలు, బ్లాక్ హోల్స్ పరిణామ దశలను కనుగొన్నారు. ఈ పరిశోధనలకు 1983 వ సంవత్సరంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. అయన కనుగొన్న సిద్దాంతం ‘చంద్రశేఖర లిమిట్’ గా పేరు పొందింది. ఇంకా ఎందరో మహానుభావులు ఉన్నారు. వారందరిని స్మరించుకోవడానికే ఇలాంటి పవిత్ర దినాలు ఉంటాయి.

Related posts

సైకో పాలన పోతేనే రాష్ట్రం అభివృద్ధి

Satyam NEWS

గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పట్ల అవగాహన కల్పించేలా కృషి

Satyam NEWS

పిల్ల‌ల అక్ర‌మ ర‌వాణాను జ‌ర‌గ‌నివ్వం….!

Satyam NEWS

Leave a Comment