28.2 C
Hyderabad
April 20, 2024 12: 57 PM
Slider ప్రత్యేకం

త్వరలో ప్రాంతీయ పార్టీల నెత్తిన పడబోతున్నది పిడుగు

Narendra-Modi

పౌరసత్వ చట్టంపై అల్లర్లు చల్లారిన తర్వాత మరో చట్టం తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలకూ, పార్లమెంటుకూ ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదనపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విస్త్రతంగా చర్చించిన విషయం తెలిసిందే.

ప్రధాని నరేంద్రమోడీ కి ఆలోచన వస్తే దాన్ని ఎలాగైనా అమలు చేసితీరుతారు. అందుకే జమిలి ఎన్నికలపై ముందుకు వెళుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు పూర్తి స్థాయి కసరత్తు చేస్తున్నది. పౌర సత్వ చట్టం, ఎన్ ఆర్ సి లపై ఇంత పెద్ద ఎత్తున విపక్షాలు ఆందోళన చేస్తాయనే విషయాన్ని నరేంద్రమోడీ ప్రభుత్వం ముందుగా అంచనా వేయలేకపోయింది.

ఈ రెండూ సజావుగా పూర్తి కాగానే జమిలి ఎన్నికల విషయాన్ని తెరపైకి తీసుకురావాలని నరేంద్రమోడీ ప్రభుత్వం భావించింది. అయితే పౌరసత్వ చట్టంపై ఇంత గొడవ జరుగుతుండటంతో జమిలి ఎన్నికల విషయం మరి కొన్ని రోజులు ఆలశ్యం అయ్యే అవకాశం కనిపిస్తున్నది. జమిలి ఎన్నికల చట్టంతో బాటే ప్రాంతీయ పార్టీల నెత్తిన ఒక పిడుగు వేయాలని కూడా నరేంద్రమోడీ ఆలోచిస్తున్నారని తెలిసింది.

అదేమిటంటే ప్రాంతీయ పార్టీలు అంటే ఒక రాష్ట్రానికి పరిమితం అయిన పార్టీలు జాతీయ స్థాయి ఎన్నికలు అంటే పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధించాలని కూడా నరేంద్రమోడీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రాంతీయ పార్టీలు పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధించడం ద్వారా కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం వచ్చేందుకు వీలుకలుగుతుంది.

ఇప్పుడు ఒక సభ్యుడు, ఇద్దరు సభ్యులు ఉన్న ప్రాంతీయ పార్టీలు లెక్కలేనని ఉన్నాయి. ఇలా లెక్కకు మించిన పార్టీలు పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేస్తూ ఓటరును గందరగోళ పరచడమే కాకుండా జాతీయ స్థాయిలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో అవరోధంగా మారుతున్నాయి.

సుస్థిర ప్రభుత్వం అంటే కేవలం సభ్యుల సంఖ్యలోనే కాకుండా విధాన పరమైన నిర్ణయాల విషయంలో కూడా చిన్న పార్టీలు మేమున్నామంటూ పెద్ద పార్టీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి. కేవలం ప్రాంతీయ ఎజెండాలతో రూపుదిద్దుకున్న ప్రాంతీయ పార్టీలకు జాతీయ స్థాయిలో ఒక ఎజెండా అంటూ లేకపోవడం వల్ల కూడా సిద్ధాంతపరమైన వైరుధ్యాలు తలెత్తుతున్నాయి.

కేంద్రంలో విశేష మెజారిటీ ఉన్న పార్టీలు కూడా చిన్న పార్టీలను బతిమిలాడి తమ విధానాలకు ఒప్పించుకోవాల్సిన పరిస్థితి ఉంది. జాతీయ విధానం లేని ప్రాంతీయ పార్టీలు తమకు నచ్చిన విధానాన్ని పాటిస్తూ దేశ సారూప్యతను దెబ్బతీస్తున్నాయని నరేంద్రమోడీ ప్రభుత్వం భావిస్తున్నది. అందువల్ల ప్రాంతీయ పార్టీలను ఆయా రాష్ట్రాలకే పరిమితం చేసి జాతీయ ఎన్నికలలో ఏదైనా జాతీయ పార్టీతో ఉమ్మడి గుర్తుపై పోటీ చేసే విధంగా చట్టానికి రూపకల్పన చేసే ప్రక్రియ గుంభనంగా సాగుతున్నట్లు తెలిసింది.

ఈ విధంగా చేయడం ద్వారా దేశ సమగ్రతను కాపాడుకోవడానికి వీలుకలుగుతుందని భావిస్తున్నారు. కేంద్రానికి పూర్తి అధికారాలు ఉన్న అంశాలను కూడా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తుండటం వల్ల చాలా వరకూ ఇబ్బందిగా ఉంది.

ఈ ఇబ్బందులను తొలగించి దేశం మొత్తం ఒక్కటే అనే భావన రావాలంటే ప్రాంతీయ పార్టీలను ఆయా రాష్ట్రాలకే కట్టడి చేయాలని, పార్లమెంటు ఎన్నికలలో కేవలం జాతీయ పార్టీలే పోటీ చేసే విధంగా చట్టం ఉండాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలిసింది.

Related posts

ఆదిలాబాద్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం

Satyam NEWS

ఉత్తరాంధ్ర లో అల్పపీడనం.. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులు..!

Satyam NEWS

వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల్లా పని చేయవద్దు

Bhavani

Leave a Comment