39.2 C
Hyderabad
April 16, 2024 17: 52 PM
Slider ఆదిలాబాద్

ఏరులై పారుతున్న మద్యం వల్లే నేరాలు

nirmal bjp

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మద్యంపై పది వేల కోట్లు ఆదాయం వస్తే ఇప్పుడు ఇరవై వేల కోట్లు ఆదాయం వస్తోందని రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఆదాయం పైనే నడుస్తోందని కృష్ణా గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్ అన్నారు. నిర్మల్ లోని బిజెపి జిల్లా కార్యాలయంలో ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విధంగా ఆదాయం కోసం మద్యం సరఫరా పెంచుకుంటూ పోవడం వల్ల మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు.

మద్యం ఏరులై పారుతున్నది. రాష్ట్రంలో మహిళలు ఒంటరిగా తిరిగే పరిస్థితులు లేవు. ఎక్కడ చూసినా మద్యం మత్తులో అత్యాచారం చేసి హత్యలకు గురిచేస్తున్నారు. మొన్న మానస నిన్న దిశా నేడు సమతా ఇట్లా రోజుకొక విధంగా క్రూరంగా అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి గ్రామంలో మంచినీళ్లు దొరకవు కానీ మద్యం దొరికే విధంగా బెల్టు షాపులో ప్రారంభించి బార్లో హోటల్లో హైవేల పంటి గుడులు బడులు ఏమీ చూడకుండా ఇష్టమొచ్చినట్టు పర్మిషన్స్ ఇచ్చి ఈ రోజు ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని ఆయన విమర్శించారు. మద్యం బహిరంగంగా విక్రయించినప్పటికీ ఎక్సైజ్ శాఖ పోలీస్ శాఖ నియంత్రణ లేని కారణంగా నేరాలు పెరిగిపోతున్నాయని అన్నారు.

ఈ సమావేశంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు అయ్యన్నగారి రాజేందర్, దళిత మోర్చ జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్ ,బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు కొరిపెల్లి శ్రావణ్రెడ్డి ,బిజెపి ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్ తోట సత్యనారాయణ ,పట్టణ ఉపాధ్యక్షుడు బోనగిరి భోజన్న ,కార్యదర్శి అల్లం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

‘ఈవా ఐవీఎఫ్’ ఆసుపత్రితో సమస్య సమసిపోయింది

Satyam NEWS

పిచ్చికుక్కలా బైరి నరేష్ వ్యాఖ్యలు

Satyam NEWS

అక్టోబర్ 1 విడుదల: ఆద్యంతం అలరించే ‘అసలేం జరిగిందంటే…?’

Satyam NEWS

Leave a Comment