36.2 C
Hyderabad
April 25, 2024 21: 27 PM
Slider ఆదిలాబాద్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి

nirmal collector

గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు చేసుకునేలా అవగాహన కల్పించవలసిన బాధ్యత వైద్య సిబ్బంది దేనని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖీ అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని తిరుమల ఫంక్షన్ హాల్ లో ఏఎన్ఎం, సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, వైద్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

బంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీలు ప్రైవేట్ ఆస్పత్రిలో వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రసవాలు చేసుకునేలా ప్రసవ ఆశ, ఏఎన్ఎం ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఆశ, ఏఎన్ఎం గర్భిణీలను మొదటి మూడు నెలల్లోనే గుర్తించి వారి పేరు నమోదు చేసుకొని సూచనలు సలహాలు ఇస్తూ వారు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేసుకునేలా మోటివేట్ చేయాలన్నారు.

ఏఎన్ఎం టూర్ డైరీని వైద్యాధికారులు పరిశీలించాలన్నారు. ప్రతిరోజు వారు ఏ గ్రామానికి వెళ్తున్నారు ఎంత మంది గర్భిణీ లను అవగాహన కల్పించారు అని తెలుసుకోవాలి అన్నారు. 90 శాతం మంది దారిద్య రేఖకు దిగువన ఉన్న వారే ఉన్నారని, పేదలకు ఆర్థిక భారం పడకుండా గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరుపుకునేలా  క్రింది స్థాయి ఉద్యోగి నుంచి ఉన్నత స్థాయి అధికారి  అధికారి వరకు ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు.

మార్చ్ మాసంలో 80% ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలని ఆయన అన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ పాల్గొన్నారు.

ఇంకా ప్రసూతి ఆసుపత్రి ఆర్ ఎం ఓ డాక్టర్ రజిని డిప్యూటీ డి ఎం హెచ్ వో లు డాక్టర్ కాశీనాథ్, డాక్టర్ ఆశిష్, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కార్తీక్, వైద్యాధికారులు హెల్త్ అసిస్టెంట్లు ఏఎన్ఎంలు తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

లాక్ డౌన్ స్పెషల్: ఇంటికే మామిడి పండ్లు వచ్చేస్తాయ్

Satyam NEWS

గద్దర్ మృతి చాలా బాధాకరం

Bhavani

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

Bhavani

Leave a Comment