39.2 C
Hyderabad
March 29, 2024 13: 39 PM
Slider ప్రత్యేకం ముఖ్యంశాలు

బూతు బొమ్మలు తొలగిస్తున్నారు, సంతోషం

Obsene pictures

యాదగిరిగుట్టలో అసలు ఏం జరుగుతోంది అంటూ సత్యం న్యూస్ ఏ మీడియా వెలుగులోకి తీసుకురాని విషయాన్ని బయటకు తీసుకువచ్చింది. అదే యాదగిరిగుట్టలో బూతు బొమ్మలు ఉన్న విషయం. అశ్లీలమైన చిత్రాలను యాదగిరి గుట్టలో స్థంభాలపై చెక్కినట్లు ఎవరూ గమనించలేదు. ఆ విషయాన్ని సత్యం న్యూస్ తన పోస్టు ద్వారా ఫొటోలతో సహా బాహ్య ప్రపంచానికి తెలియచేసింది. ఇప్పుడు ఈ బూతు బొమ్మలను గుర్తించి వాటిని తొలగించే ప్రయత్నాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి కె.భూపాల్ రెడ్డి యాడా వైస్ చైర్మన్ కిషన్ రావు, ఆలయ శిల్పి ఆనందసాయి తదితరులతో ప్రగతి భవన్ లో సమావేశం అయి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి లేదా ఇతర ప్రముఖుల బొమ్మలు, పార్టీల చిహ్నాలు, ప్రభుత్వ పథకాలు తదితర అన్నింటితో బాటు బూతు బొమ్మలను కూడా గుర్తించి తొలగించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సత్యం న్యూస్ ముందుగా ఇచ్చిన వార్తను మరొక్కమారు మీ దృష్టికి తీసుకువస్తున్నాము.

తొలి వార్త:యాదగిరి గుట్టలో అసలు ఏం జరుగుతోంది? కేసీఆర్ బొమ్మలు కారుగుర్తులు కాదు. ఇప్పుడు అంతకన్నా పెద్ద ఉపద్రవం వచ్చిపడింది. యాదగిరి గుట్టలో దారుణం జరిగిపోతున్నది. దేవాలయం పేరుతో దరిద్రాన్ని తెచ్చిపెడుతున్నారు. ఇదంతా ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొని ఉంది. యాదగిరిగుట్టలో పునర్ నిర్మాణం చేపడుతున్న ఆలయంలో బూతు బొమ్మలు కూడా ఉన్నాయి. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ దేవాలయంలో బూతుబొమ్మలు చెక్కారు. అత్యంత దారుణమైన ఈ విషయం ఇప్పటి వరకూ ఎవరి దృష్టికి రాలేదు. సత్యం న్యూస్ దీనికి సంబంధించిన ఆధారాలను ఇక్కడ పొందుపరుస్తున్నది. మేధావులు, ఆలోచనాపరులు ఈ విషయంపై దృష్టి సారించాలి. లేకపోతే యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం కాజాలదు. దేవాలయాలపై ఒకప్పుడు బూతు బొమ్మలు ఉండేవి. అది ఆ నాటి కాలమాన పరిస్థితుల్లో అనివార్యం. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇప్పుడు దేవాలయాలపై బూతు బొమ్మలు పెట్టుకుంటూ పోతే మనం నాగరికత వైవు వెళుతున్నామా లేక పూర్వకాలంలోకి వెళ్లిపోతున్నామా అనేది ఆలోచించుకోవాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి పిల్లల నుంచి పెద్ద వారి వరకూ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్న ఈ రోజుల్లో దేవాలయాల్లో బూతు బొమ్మలు ఉంటే ఎలా? ఒక వ్యక్తి ఒక వ్యక్తితోనే సంపర్కంతో ఉండాలని అందరూ చెబుతుంటే ఒకే వ్యక్తి ముగ్గురు మహిళలతో సంభోగిస్తున్నట్లు శిల్పాలుచెక్కి దేవాలయాల్లో పెడితే ఇంకేమన్నా ఉందా?  దేవాలయాల పునరుద్ధరణ పేరుతో మనం ఈ సమాజానికి ఇస్తున్న మెసేజ్ ఏమిటి? యాదగిరి గుట్టలో ఒక స్థంభంపై ఒక పురుషుడు ముగ్గురు మహిళలతో ఒకే సారి సంభోగిస్తున్నట్లుగా శిల్పం చెక్కారు. దారుణమైన ఈ విషయాన్ని ఇంతకన్నా విశ్లేషించిచెప్పడం కుదరదు. పెరుగుతున్న లైంగిక వ్యాధుల నేపథ్యంలో సేఫ్ సెక్స్, ఒకరితోనే సెక్సు అనే కాన్సెప్టులను చాలా కాలంగా ప్రభుత్వం ప్రచారం చేస్తున్న ఈ కాలంలో ఒకే సమయంలో ముగ్గురితో సెక్స్ చేసే భంగిమలు ప్రచారం చేయడం అదీ కూడా దేవాలయాల్లోనా? దారుణం. అత్యంత దారుణం. ఇది కూడా ఎవరూ చెప్ప కుండా శిల్పులే చేశారని చెబుతారా కిషన్ రావుగారూ? లేక ఇది మీ టేస్టుకు అనుగుణంగా చేయించుకున్నారా? (కిషన్ రావు యాదాద్రి నిర్మాణ ప్రత్యేక అధికారి)

ఈ వార్తలో విషయప్రాధాన్యతే తప్ప అభ్యంతరకర వ్యాఖ్యలు లేవు. అయితే కొందరు ఫేస్ బుక్ మాధ్యమంగా సత్యం న్యూస్ పైనా ఈ వార్త రచయితపైనా అత్యంత దారుణమైన, నీచమైన వ్యాఖ్యలు రాశారు. బూతులతో కూడిన ఆ వ్యాఖ్యలను ఇక్కడ ప్రస్తావించదలచుకోలేదు కానీ అలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి సత్యం న్యూస్ చెప్పేది ఒక్కటే. మేం జర్నలిజానికి కట్టుబడి ఉన్నాం తప్ప ఎవరినో బద్నాం చేయడానికో ఎవరినో పొగడటానికో ఇక్కడ లేం. దాదాపు 40 సంవత్సరాల పాటు పాత్రికేయ వృత్తిలో ఉన్న మా బృందం పై అశ్లీలమైన పోస్టింగులు పెడుతున్న వారికి ఆ భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రార్దిస్తున్నాము.

Related posts

హాట్ కామెంట్ చేసిన ఈటలతో సీఎం కేసీఆర్ సమావేశం

Satyam NEWS

పరిశుభ్రతకు OYO, యునిలివర్ భాగస్వామ్యం

Satyam NEWS

కులంపేరుతో దూషించిన వారిని అరెస్టు చేయాల‌ని ధ‌ర్నా

Sub Editor

Leave a Comment