36.2 C
Hyderabad
April 24, 2024 20: 06 PM
Slider ప్రత్యేకం

ఒపీనియన్: లాక్ డౌన్ సడలిస్తే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

Lock Down

ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలకన్నా అభివృద్ధి చెందుతున్న దేశమైన మన దేశం కరోనా మహమ్మారి వ్యాప్తిని నివారించడంలో సఫలీకృతం అవుతున్న విషయం అందరికి తెలిసిందే.

ఇంతటి విజయానికి ముందు చూపుతో అతి కష్టతరమైన, అనేక ఇబ్బందులతో కూడుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని తీసుకుని దాన్ని నిర్విఘ్నంగా అమలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ అభినందనీయుడు. ఈ లాక్ డౌన్ ప్రయోగం 130 కోట్ల మంది ఉన్న దేశంలో ఎలా అమలు జరుగుతుందా అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనించాయి.

చాలా దేశాలు మన దేశంలో లాక్ డౌన్ ప్రయోగం విఫలం అవుతుందనే అనుకున్నారు. అయితే నరేంద్రమోడీ పిలుపు మేరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను స్థిరంగా అమలు చేశాయి.

దాని ఫలితాన్ని చూస్తూ ఉన్నాం. మందులేని కరోనా ను నిలువరించడానికి ఇంత కన్నా మార్గం లేదని ప్రధాని చెప్పిన విషయాన్ని 130 కోట్ల మంది భారతీయులు అర్ధం చేసుకున్నారు.

కొద్ది మంది తప్ప. ఇబ్బందులతో కూడిన ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా దేశ ప్రజలు స్వీకరించారు. చప్పట్లు కొట్టమంటే కొట్టారు. దీపాలు వెలిగించమంటే వెలిగించారు. ఇంతటి ఈ సఫల ప్రయోగం ఈ నెల 14వ తేదీ రాత్రికి ముగియబోతున్నది. ఈ దశలోనే దీన్న పొడిగించడమా లేక పాక్షికంగా అమలు చేయడమా అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాల్సిన పని. చాలా దేశాలు ఆర్ధిక నష్టం జరగకుండా చూసేందుకే ప్రాధాన్యతనిచ్చాయి.

అయితే మన దేశం మాత్రం ప్రాణనష్టం జరగకుండా చూసేందుకు ప్రాధాన్యతనిచ్చిందని చెప్పుకోక తప్పదు. అందుకు తమ ప్రాణాలను లెక్క చేయకుండా మొదటి వరుసలో నిలబడిన డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు. వీరంతా ఎంతో సేవ చేస్తున్నారు.

రాబోయే 8 రోజులు మరింత గడ్డుకాలం. ఈ సమయంలో కరోనా ఉధృతి ఎంత ఉంటుంతో ఊహించడం కూడా కష్టం. ఎందుకంటే ఇప్పటికే కరోనా సోకిన వారికి 14 రోజుల కాలపరిమితి ముగియబోతున్నది.

అందువల్ల మరణాల సంఖ్య కూడా పెరగవచ్చు. మర్కజ్ సంఘటన వల్ల కొత్త కేసుల సంఖ్య కూడా మరింత పెరగవచ్చు. అందుకే ఇది ఇప్పటి వరకూ గడచిన కాలం కన్నా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన కాలం.

ఈ ఎనిమిది రోజుల పాటు ప్రజలు సంయమనం పాటిస్తే లాక్ డౌన్ ను పాక్షికంగా ఎత్తేయడం శ్రేయస్కరం. ఈ 8 రోజుల్లో ఉధృతి ఎక్కువ అయితే లాక్ డౌన్ పొడిగించడమే శ్రేయస్కరం. ఏది ఏమైనా లాక్ డౌన్ పూర్తిగా తొలగించడం కత్తిమీద సాములాంటిదే.

లాక్ డౌన్ ను పాక్షికంగా ఎత్తేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక వేళ లాక్ డౌన్ సడలించినా లేదా ఎత్తేసినా ప్రభుత్వ రవాణాను పూర్తిగా నిలిపివేయాలి. అంతర్జాతీయ విమానాలను పునరుద్ధరించవద్దు.

దేశీయ విమానాలను నడపవద్దు. సినిమాహాళ్లు షాపింగ్ మాల్స్ మూసివేత కొనసాగించాలి. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా భౌతిక దూరాన్ని పాటించేందుకు సోషల్ పోలీసింగ్ మరింత కఠినంగా అమలు చేయాలి.

కరోనా బాధితులకు సేవ చేసే డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య పని వారికి సేఫ్టీ మెజర్స్ మరింత బాగా తీసుకోవాలి. అలా చేయకపోతే బాధితుల కుటుంబం సభ్యులతో బాటు వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది కుటుంబ సభ్యలు కరోనాకు గురి కావచ్చు.

వారి సేవలకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్ వానిని కూడా నియమించేందుకు నిర్ణయం తీసుకున్నది. వీళ్లందరిని నియమించే సమయంలో వారికి సరైన అవగాహన కల్పించి వీళ్లందరికి కావాల్సిన వసతులు కల్పించి వినియోగించు కోవాల్సిన ఆవశ్యకత ఉంది.

లేకపోతే ఈ మహమ్మారీ విజృంభించి చాలా మంది బలి అవుతారు.

కేసానుపల్లి వేంకటేశ్వర్లు, సత్యంన్యూస్ సిటిజన్ జర్నలిస్టు

Related posts

కాకతీయ విద్యార్థి సునీల్ ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే

Satyam NEWS

కరోనాతో మరణించి పోలీసు కుటుంబాలకు ఆర్ధిక సాయం

Satyam NEWS

భగ్గుమన్న భాజపా శ్రేణులు: దిష్టిబొమ్మల దహనం

Satyam NEWS

Leave a Comment