28.2 C
Hyderabad
April 20, 2024 11: 13 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

మన మిసైల్ మన సైనికుల్ని హతమార్చిన వేళ…

helecopter

అవి పాకిస్తాన్ తో అప్రకటిత యుద్ధం జరుతున్న రోజులు. ఫిబ్రవరి 27వ తేదీ. జమ్మూ కాశ్మీర్ లోని నౌషేరా సెక్టార్ లో అటు పాకిస్తాన్ యుద్ధ విమానాలు, ఇటు భారత్ యుద్ధ విమానాలు మోహరించి ఉన్నాయి. ఉదయం 10.30 నిమిషాలు అవుతున్నది. అభినందన్ వర్తమాన్ ఉన్న జెట్ అప్పుడే కూలిపోయింది. అభినందన్ పాకిస్తాన్ సైనికులకు చిక్కాడు. అతడిని కొట్టుకుంటూ తీసుకువెళ్తున్నారు. అదే సమయంలో లేదా అంతకు కొద్ది నిమిషాల కిందట రష్యా నుంచి మనం కొనుగోలు చేసిన యుద్ధ హెలికాప్టర్ ఒకటి కూలిపోయింది. ప్రమాద వశాత్తూ కాదు, పాకిస్తాన్ చేసిన దాడి వల్ల కూడా కాదు. శ్రీనగర్ ఎయిర్ బేస్ నుంచి మన సైనిక అధికారులు వదిలిన మిస్సైల్ తగిలి. అంటే మనం వదిలిన మిసైల్ తో మన హెలికాప్టరే కూలిందన్నమాట. హెలికాప్టర్ లో ఉన్న ఆరుగురు సైనికులు అక్కడి కక్కడే చనిపోయారు. అకస్మాత్తుగా హెలికాప్టర్ కు మిసైల్ తగలడంతో కూలిపోయి ఆ సమయంలో అక్కడ ఉన్నమరో పౌరుడు కూడా మరణించారు. మిసైల్ ధాటికి హెలికాప్టర్ నుగ్గునుగ్గయింది. పాకిస్తాన్ ఈ హెలికాప్టర్ ను కూల్చేసిందని అనుకున్నారు మొదటిలో. అయితే ఆ తర్వాత తెలిసింది అసలు విషయం దాంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.  శ్రీనగర్ ఎయిర్ బేస్ కు చెందిన అధికారులు తప్పు చేశారని నిర్ధారణ అయింది. దాంతో ఇద్దరు అధికారులతో సహా మొత్తం ఐదుగుర్ని విధుల నుంచి తొలగించారు. వారు కోర్టు మార్షల్ ఎదుర్కొవాల్సి ఉంటుంది. నౌషేరా సెక్టార్ లో యుద్ధ విమానాలు మోహరించాయన్న విషయం తెలిసిన వెంటనే హెలికాప్టర్ ను సుక్షిత ప్రాంతానికి తరలించకుండా . శ్రీనగర్ ఎయిర్ బేస్ కు వెనక్కి వచ్చేయాలని ఆదేశాలు ఇవ్వడం పెద్ద తప్పు. ఎయిర్ బేస్ నుంచి సమాచారం రాగానే హెలికాప్టర్ వెనక్కి మళ్లింది. అదే సమయంలో ఎయిర్ బేస్ నుంచి మిసైల్ పేల్చారు. దాంతో మిసైల్ వెళ్లి దారి మధ్యలో ఉన్న హెలికాప్టర్ ను కొట్టేసింది.

Related posts

మత్స్యకారుల వలలో బంగారు తాబేలు

Bhavani

(Over|The|Counter) Is Cbd Topical With Hemp Addictive Cbd Flower Hemp Review Cbd Oil From Hemp Vs Marijuana

Bhavani

యువగళం పాదయాత్రలో పాల్గొన్న మూల్పూరి సాయి కల్యాణి

Satyam NEWS

Leave a Comment