28.2 C
Hyderabad
April 20, 2024 11: 41 AM
Slider ప్రత్యేకం

ఒవైసీ సభలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు

protest

పాకిస్తాన్ జిందాబాద్… పాకిస్తాన్ జిందాబాద్… ఈ స్లోగన్లు పాకిస్తాన్ లోనో జమ్మూ కాశ్మీర్ లోనో వినిపించలేదు. కొద్ది సేపటి కిందట బెంగళూరులో వినిపించాయి. దేశం మొత్తం నిర్ఘాంత పోయే ఈ సంఘటన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ నిర్వహించిన సభలో నేటి సాయంత్రం జరిగింది.

పౌరసత్వ చట్టంపై నిరసన వ్యక్తం చేసేందుకు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అత్యధికంగా ముస్లింలు ఈ సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ పౌరసత్వ చట్టం దేశ రాజ్యాంగానికి విరుద్ధమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కావాలని ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారని దీనివల్ల దేశ రాజ్యాంగానికి విఘాతం కలుగుతుదని ఆయన అన్నారు.

ఇదే సభలో ఒక యువతి స్టేజీ పైకి వచ్చింది. మైకు తీసుకున్నది. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ స్లోగన్లు ఇచ్చింది. పలుమార్లు ఆ యువతి పాకిస్తాన్ కు జిందాబాద్ కొట్టింది. దాంతో స్టేజి వెనుక భాగంలో ఉన్న ఒవైసీ తదితరులు పరుగున వచ్చి ఆ అమ్మాయి చేతిలో మైక్ లాక్కున్నారు. ఆ అమ్మాయి చివరకు హిందూస్థాన్ జిందాబాద్ అని ఒక్క సారి నినాదం చేసింది. తక్షణమే రంగంలో దిగిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఉప్పర్ పేట్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు.

Related posts

మళ్లీ కుక్క బుద్ధి ప్రదర్శించిన చైనా

Satyam NEWS

ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శ్రీ మహర్షి వాల్మీకి జయంతి

Satyam NEWS

ఖమ్మం నగరానికి 49.49 కోట్లు

Sub Editor 2

Leave a Comment