30.7 C
Hyderabad
April 17, 2024 02: 55 AM
Slider ప్రత్యేకం

కరోనా తగిలించిన తబ్లిగీ జమాత్ పై పాకిస్తాన్ ఉక్కుపాదం

Lahore

ఢిల్లీలోని నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదులో మత పరమైన సమావేశం నిర్వహించి భారత్ మొత్తానికి కరోనా వైరస్ ను వ్యాప్తి చేసిన తబ్లిగీ జమాత్ పాకిస్తాన్ లో కూడా అదే పని చేసింది.

అనుమతి లేకపోయినా లాహోర్ శివారు ప్రాంతమైన రైవిండ్ నగరంలో తబ్లిగీ జమాత్ భారీ సమావేశం నిర్వహించింది. దాదాపు రెండున్నర లక్షల మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. వారంతా దగ్గర దగ్గరగా కూర్చుని ఒకే చోట నిద్రించారు.

దాదాపు 12 దేశాల నుంచి వందలాది మంది ప్రతినిధులు తబ్లిగీ జమాత్ కు హాజరయ్యారు. అప్పటికే కరోనా విజృంభించడంతో పాకిస్తాన్ ప్రభుత్వం వారిని బలవంతంగా ఖాళీ చేయించాల్సి వచ్చింది. తబ్లిగీ జమాత్ కు చెందిన 40 మత బోధకులకు కరోనా పాజిటివ్ తేలడం తో పాకిస్తాన్ ఆ సమావేశం పై ఉక్కుపాదం మోపింది.

తబ్లిగీ జమాత్ ప్రధాన కార్యాలయం ఉన్న రైవిండ్ నగరంలో పాకిస్తాన్ ప్రభుత్వం పూర్తి లాక్‌డౌన్ విధించింది. మెడికల్ స్టోర్లు సహా అన్ని దుకాణాలను మూసి వేయడంతో పాటు ప్రజలెవరూ బయటికి రాకుండా ఆంక్షలు విధించింది. మరో 50 మందిలో కూడా వైరస్ అన్నట్టు అనుమానిస్తున్నారు.

ఇందులో ఐదుగురు నైజీరియా మహిళలు కూడా ఉన్నారు. వారందరినీ లాహోర్ కు 50 కి.మీ. దూరంలో ఉన్న కసూర్ లోని క్వారంటైన్ సెంటర్లో చేర్చారు. అలాగే, సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్ సిటీలో తబ్లిగీ జమాత్‌ కు చెందిన 38 మందికి లోకల్ ట్రాన్ మిషన్ ద్వారా కరోనా సోకినట్టు గుర్తించారు.

లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన పలువురు తబ్లిగీ జమాత్ మతబోధకులను సింధ్, పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలెవరూ గుమికూడదని పాకిస్తాన్ ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ గత నెలలో తబ్లిగీ జమాత్ రైవిండ్‌లో తమ వార్షిక సదస్సు నిర్వహించింది.

ఐదు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో పలు దేశాలకు చెందిన వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. తమ దేశంలో కరోనా వైరస్ ప్రబలడానికి కారణం తబ్లిగీ జమాత్ అని లాహోర్ డిప్యూటీ కమిషనర్  దానిష్ అఫ్జాల్ స్పష్టం చేశారు. (ఇంత కన్నా తీవ్రమైనదైనా మన నాయకులు ఈ విషయం చెప్పడంలేదు)

తబ్లిగీ జమాత్ కార్యకర్తల్లో చాలా మందికి ఇప్పటికే కరోనా గుర్తించామని ఆయన అన్నారు. ప్రభుత్వం తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ప్రభుత్వం చెప్పే సమయానికే పలు దేశాల నుంచి ప్రతినిధులు వచ్చేశారని అందువల్ల ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి తాము సమావేశం జరుపుకోవాల్సి వచ్చిందని తారిక్ జమాల్ అనే తబ్లిగీ జమాత్ సభ్యుడు స్పష్టం చేశారు. (ఢిల్లీ మర్కజ్ ప్రతినిధులు కూడా సరిగా ఇలానే చెప్పిన విషయం తెలిసిందే)

Related posts

గుట్కా కావాలా? నో ప్రాబ్లం ఈ గాడిదలు తెచ్చిస్తాయి

Satyam NEWS

గుడ్ అరేంజ్మెంట్స్: మేడారం ఏర్పాట్లు భేష్

Satyam NEWS

తెనాలి ఫ్లైఓవర్ పై మందుబాబుల ఆగడాలు

Satyam NEWS

Leave a Comment