30.7 C
Hyderabad
April 19, 2024 07: 46 AM
Slider ప్రత్యేకం

క్వశ్చన్: రాజధాని భూములు పేదలకా? ఇదేం పద్ధతి?

pawan kalyan

రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయడాన్ని జన సేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా విమర్శించారు. ట్విట్టర్ వేదికగా ఆయన నేడు స్పందించారు. నిర్దిష్ట అవసరాల కోసం సమీకరించిన భూములను ఇతర అవసరాలకు కేటాయిస్తే వివాదాలు రేగే అవకాశముందని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన భూములను ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడాన్ని పవన్ తప్పుబట్టారు.

ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలం ఇస్తామంటే ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరని, చిత్తశుద్ధి ఉంటే పేదలకు వివాద రహిత భూములనే పంపిణీ చేయాలని హితవు పలికారు. భూములు ఇచ్చిన రైతులు ఓవైపు ఉద్యమాలు చేస్తుంటే, మరోవైపు ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేయడం ప్రజల మధ్య చిచ్చుపెట్టడమేనని ఆరోపించారు. రాజధాని భూములను లబ్దిదారులకు ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని, కానీ ఆ తర్వాత చట్టపరమైన చిక్కులు వస్తే బాధపడేది పేదవాళ్లేనని అభిప్రాయపడ్డారు

Related posts

విగ్రహాల విధ్వంసం నెపంతో రాష్ట్రంలో మతకల్లోలాలు సృష్టిస్తున్నారు

Satyam NEWS

కబడ్డీ టైం:జిల్లాస్థాయి బాలబాలికల జూనియర్ సెలెక్షన్

Satyam NEWS

ఆసరా పింఛన్‌ దరఖాస్తులకు రుసుం వసూలు చేయవద్దు

Satyam NEWS

Leave a Comment