39.2 C
Hyderabad
March 29, 2024 15: 43 PM
Slider తెలంగాణ ప్రత్యేకం

విద్యార్ధుల ఆత్మహత్యలపై సుప్రీంలో తాజాగా పిటిషన్

SupremeCourtofIndia

తెలంగాణలో 23 మంది ఇంటర్ మీడియట్ విద్యార్ధుల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. విద్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితా (కాంకరెంట్ లిస్టు) లో ఉన్నందున కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని కూడా పిటిషన్ లో కోరారు. తెలుగు అకాడమీ మాజీ డైరక్టర్, ప్రముఖ విద్యా వేత్త వెలిచాల కొండలరావు తొలుత తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ వ్యాజ్యం పై విచారించిన సుప్రీం కోర్టు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పరిధిలోనే పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్ కు సూచించింది. దాంతో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై వాదోపవాదనలు జరిగాయి. విద్యార్ధుల ఆత్మహత్యలకు తాము బాధ్యులం కాదని తెలంగాణ బోర్ట్ ఆఫ్ ఇంటర్ మీడియట్ వాదించింది. ప్రభుత్వం కూడా అదే వాదన వినిపించింది. హైకోర్టు సూచన మేరకు వెరిఫికేషన్ కు ఇంటర్ బోర్డు అంగీకరించింది. విద్యార్ధులు కూడా తమ మార్కులను తిరిగి లెక్కించుకోవచ్చునని, తమ ఆన్సర్ షీట్లను చూసుకోవచ్చునని వాటన్నింటిని స్కాన్ చేసి ఆన్ లైన్ లో ఉంచింది. రీ వాల్యయేషన్ లో ఎలాంటి అవకతవకలు జరగలేదని బోర్డు కోర్టుకు వెల్లడించింది. 23 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకోగా వారి వివరాలను కోర్టుకు సమర్పించింది. ఒక అమ్మాయి మూడు పరీక్షలు రాసి ఆత్మ హత్యచేసుకున్నదని అందుకు తాము ఎలా బాధ్యులమౌతామని బోర్డు ప్రశ్నించింది. మరో ఇద్దరు రిజల్సు రాకముందే ఆత్మహత్య చేసుకున్నారని 20 మంది రిజల్సు వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు కానీ వారి మార్కులలో రీవాల్యయేషన్ చేసినా తేడా లేదని బోర్డు కోర్టుకు తెలిపింది. దాంతో తెలంగాణ హైకోర్టు వారితో క్షమాపణ చెప్పించి కేసును ముగించింది. ఆ తర్వాత బిజెపి రాష్టఅధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యల విషయాన్ని వినతి పత్రం రూపంలో సమర్పించారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర హోం శాఖ సమాధానం కోరింది. ఈ దశలో సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాది నిరూప్ రెడ్డి బాలల హక్కుల సంఘం తరపున మరో పిటీషన్ దాఖలు చేశారు. సత్యం న్యూస్ ఈ విషయాన్ని ధృవీకరించుకున్నది. విద్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి జాబితాలో ఉన్నందున కేంద్రం ఈ విషయంలో మౌనంగా ఉండజాలదని పిటీషనర్ అభిప్రాయపడ్డారు. చాలా స్కూళ్లు కాలేజీలలో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉండటం లేదని అందువల్ల విద్యార్దులు సక్రమంగా చదువుకోలేకపోతున్నారని పిటిషనర్ అంటున్నారు. సరైన సదుపాయాలు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయినందునే విద్యార్ధుల ఆత్మ హత్యలు సంభవిస్తున్నాయని పిటిషనర్ అభిప్రాయపడుతున్నారు. న్యాయవాది నిరూప్ రెడ్డి దాఖలు చేసిన ఈ  పిటిషన్ ను సుప్రీంకోర్టు ఆమోదించింది. పిటిషన్ లో తెలంగాణా ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చారు. ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యల వ్యవహారంపై మళ్లీ న్యాయ స్థానంలో పిటీషన్ రూపంలో రావడంతో తెలంగాణ లోని ఇంటర్ విద్యార్ధినీ విద్యార్ధుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

ప్రశాంత వాతావరణంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణ

Satyam NEWS

ఇసుక రవాణాకు ఇప్పుడు గేట్లు ఎత్తారు

Satyam NEWS

సోషల్ మీడియా లో హల్ చల్  చేస్తున్న మంచు విష్ణు ‘గోలీ సోడా వే’

Satyam NEWS

Leave a Comment