36.2 C
Hyderabad
April 25, 2024 21: 23 PM
Slider మహబూబ్ నగర్

చైర్మన్ వైస్ చైర్మన్ భర్తలపై చర్యలు తీసుకోవాలి

kollapur PS 1

ప్రజల ఓట్లతో ఎన్నికైన కౌన్సిలర్ల ను దుర్భాషలాడిన కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ భర్తలపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు వర్గ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి, గులాబీ దళపతి  కేసీఆర్ జన్మదిన సందర్భంగా  టిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు  పీజీ కాలేజీ లో  హరితహార కార్యక్రమం  నిర్వహించారు.

ఈ సందర్భంగా సింహం గుర్తుతో గెలిచిన 11మంది కౌన్సిలర్లకు ఆహ్వానం ఇవ్వకుండా చైర్మన్ వ్యవహరించిన విధానంపై  కౌన్సిలర్లు మీడియాతో మాట్లాడారు. కౌన్సిలర్ లకు పిలుపు ఇవ్వకుండా ఒక పురపాలక కార్యాలయంలో కూర్చోబెట్టి కార్యక్రమం నిర్వహించారని మండిపడ్డారు. ప్రోటోకాల్ లేని వ్యక్తులతో ఎలా కార్యక్రమం నిర్వహిస్తారని వారు ప్రశ్నించారు. అంతేకాకుండా హరితహారం కార్యక్రమానికి కౌన్సిలర్లు హాజరు కాగా కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ భర్తలు మహిళా, మిగతా కౌన్సిలర్ల పై అసభ్యంగా మాట్లాడడంతో ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే ఉన్నతాధికారులు ఛైర్మన్ వైస్ ఛైర్మన్ భర్తలపై  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా  11మంది కౌన్సిలర్లను కించపరిచే విధంగా, వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా క్రూర మృగాలు జనంలో తిరుగుతున్నాయని అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిపై కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలర్లు ఎస్ఐ కొంపల్లి మురళి గౌడ్ కు ఫిర్యాదు చేశారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపారు. ఈ కార్యక్రమంలో  6వ వార్డు  కౌన్సిలర్ మేకల రమ్య నాగరాజు,10వ వార్డు కౌన్సిలర్  షేక్ రహీం పాష,13వ వార్డు కౌన్సిలర్ మేకల శిరీష కిరణ్ యాదవ్,11వ వార్డు బోరెల్లి కరుణ మహేష్, 2వ వార్డు కౌన్సిలర్ బడా అనిత రమేష్, 9వ వార్డు కౌన్సిలర్ నయిమ్, 8వ వార్డు కౌన్సిలర్ శ్రీ లక్ష్మి వేణు యాదవ్, మేకల నగరాజు, మాజీ జెడ్పిటిసి హనుమంత్ నాయక్, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ ఎక్బాల్, మద్యాల రాందాస్, రెడ్డి సత్యం, మేకల కిషోర్ యాదవ్,  పశుల వెంకటేష్, జి.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వెలుగు పువ్వులు

Satyam NEWS

నల్లకుంట డివిజన్ లో కొత్త రోడ్లకు శంకుస్థాపన

Satyam NEWS

గణతంత్ర వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలి

Satyam NEWS

Leave a Comment