32.7 C
Hyderabad
March 29, 2024 11: 20 AM
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

హైదరాబాద్ వరకూ వచ్చిన ఆళ్లగడ్డ పంచాయితీ

akhilapriya

తెలుగుదేశం పార్టీ నాయకులు సుద్దపూసలని తమపై ఏపి పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారని క్రమం తప్పకుండా చెబుతున్న చంద్రబాబునాయుడు తన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త చేసిన నిర్వాకంపై ఏమంటారో చూడాలి. ఆళ్లగడ్డ లోని క్రషర్ విషయంలో అక్కడి శివరామి రెడ్డి బృందానికి, మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకురాలు భూమా అఖిలప్రియ భర్త భార్గవ లకు మధ్య ఇటీవల ఘర్షణ చెలరేగింది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల ఒకటిన భార్గవ్ పై ఆళ్లగడ్డ పీఎస్ లో ఐపీసీ సెక్షన్ 143, 427, 447, 307, 507 ల కింద కేస్ నమోదయింది. ఈ క్రైమ్ నెంబర్ 161/2019, 162/2019 కేసులలో భార్గవ  A1 ముద్దాయిగా వున్నాడు. అయితే అప్పటి నుండి భార్గవ్ పోలీసుల కళ్ల పడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఆళ్లగడ్డ పోలీసులు విధినిర్వహణలో భాగంగా భార్గవ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. భార్గవ్ గచ్చిబౌలిలో ఉంటున్నట్లు సమాచారం అందుకున్న ఆళ్లగడ్డ ఎస్ ఐ రమేష్ కుమార్ గచ్చిబౌలి వచ్చారు. నిన్న సాయంత్రం AP 21 CK 0222 నంబర్ గల బ్లాక్ ఫార్చూనర్ కార్ లో డ్రైవ్ చేస్తూ భార్గవ ఎస్ ఐ కి కనిపించాడు. దాంతో ఆయన తన బృందానికి సమాచారం ఇచ్చాడు. ఏపీ పోలీస్ టీం అఖిలప్రియ భర్త ను పట్టుకునేందుకు ప్రయత్నించింది. ఏ పీ పోలీసులను గుర్తించిన భార్గవ కారు ఆపకుండా వేగంగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దారిలో వెళ్ళాడు. దాంతో భార్గవ కారును పోలీస్ బృందం ఫాలో అయింది. గచ్చిబౌలి లోని ఓక్ వుడ్ హోటల్ వద్ద భార్గవ కారు ను పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. కారు ఆపినట్లే ఆపి భార్గవ వేగంగా ఎస్ ఐ పైకి కారు పోనిచ్చాడు. దాంతో ఒక్క సారిగా ఉలిక్కిపడిన పోలీసులు తేరుకునే లోపున అతడు పరారయ్యాడు. తమ విధులను ఆటంకపరచడం తో పాటు, కారు తో గుద్దే ప్రయత్నం చేసాడని ఆళ్లగడ్డ ఎస్ ఐ భార్గవ పై పిర్యాదు ఇచ్చాడు. ఐపీసీ సెక్షన్ 353, 336 సెక్షన్ల కింద గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.

Related posts

ఏపీలో పగటి పూట పాక్షిక కర్ఫ్యూ

Satyam NEWS

క‌రోనా మృతుల‌కు సీపి స‌హా పోలీసు ఉన్న‌తాధికారుల నివాళి

Satyam NEWS

ఐసోలేషన్: వూహాన్ నుంచి వచ్చిన 112 మంది

Satyam NEWS

Leave a Comment