31.2 C
Hyderabad
April 19, 2024 06: 03 AM
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిచ్చుపెడుతున్నారు

cbn kodela yrapatineni

రాజకీయ కారణాలతో పల్నాడును రణరంగంగా మార్చేందుకు తెలుగుదేశం పార్టీ అడుగులు వేస్తున్నది. దీనికి వైసిపి కూడా తనవంతు రాజకీయం జోడిస్తున్నది. వాస్తవానికి పల్నాడులో అంత భయానక పరిస్థితులు లేవు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం ఒకప్పుడు ముఠాల నిలయంగా ఉండేది కానీ కాలక్రమేణా ఆ పరిస్థితి మారిపోయింది. మరీ ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో ఎన్నికల కక్షలు ఎక్కువగా ఉండేవి. నాలుగు దశాబ్దాల కిందట తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు పల్నాడులో ఒకే పార్టీలో రెండు వర్గాలు ఉండేవి. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఒక వర్గం తెలుగుదేశంలో రెండో వర్గం కాంగ్రెస్ లో ఉండేవి. తెలుగుదేశం పార్టీకి కోడెల శివప్రసాదరావు నాయకుడుగా వచ్చిన తర్వాత కాంగ్రెస్ వర్గాలను ఎక్కడికక్కడ అణచివేసి తెలుగుదేశం పార్టీ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ తర్వాత కాంగ్రెస్ కూడా బలం పుంజుకునే సరికి రాజకీయ తగాదాలు దారుణంగా ఉండేవి. కాలక్రమేణా కోడెల శివప్రసాదరావు తన బలాన్ని నిలుపుకునేందుకు హింసా రాజకీయాల వైపు మొగ్గారు. బలవంతంగా ప్రత్యర్ధులను అణచివేయడం మొదలు పెట్టారు. ఆ తర్వాత కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లి వైపు వెళ్లిపోవడంతో పల్నాడు ప్రాంతం దాదాపుగా సైలెంటు అయిపోయింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావడంతో కోడెల శివప్రసాదరావు సత్తెనపల్లిలోనే కాకుండా నరసరావుపేట, గురజాల తదితర ప్రాంతాలలో కూడా తన దైన శైలిలో రాజకీయం చేస్తూ వచ్చారు. వైసిపి ఎక్కడిక్కడ ఎదుర్కొటున్నా కూడా బలమైన తెలుగుదేశం నాయకులు ఎక్కడికక్కడ అణచివేసేవారు. ఈ నేపథ్యంలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చింది. అయినా తెలుగుదేశం పార్టీ వెనక్కితగ్గలేదు. వైసిపి నాయకులపైకి తన కార్యకర్తల్ని రెచ్చగొట్టడంలో కోడెల, యరపతినేని తదితరులు కృతకృత్యులవుతూనే ఉన్నారు. ఈ దశలో కోడెలపై అసెంబ్లీ ఫర్నీచర్ కొట్టేసి ఇంట్లో పెట్టుకున్న కేసు, యరపతినేని పై అక్రమ మైనింగ్ కేసు వచ్చాయి. ఈరెండు కేసులు రుజువు అయితే పల్నాడు ప్రాంతంలో ఇక తెలుగుదేశం పార్టీ క్లోజ్ అయిపోయినట్లే. అందుకే ఇప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు రంగంలో దిగారు. వారిని కాపాడుకోవడానికి రాజకీయ చదరంగం రచించారు. పల్నాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపేస్తున్నారని ప్రచారం మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే ఛలో ఆత్మకూరు కార్యక్రమం మొదలు పెట్టారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి తెలుగుదేశం నాయకులు కూడా దీన్ని అవకాశంగా మలచుకుంటున్నారు. అనుకోకుండా వైసిపి కూడా రంగంలో దిగడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొన్నది. తెలుగుదేశం పార్టీకి స్థానిక కార్యకర్తలు నాయకుల నుంచి మద్దతు దొరకడం లేదు. కోడెల, యరపతినేని కి మద్దతు ఇచ్చేందుకు వారు సిద్ధంగా లేరు. ఏది ఏమైనా పల్నాడును రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరం.

Related posts

ఎక్సయిజ్ పోలీసుల దాడిలో పట్టుబడ్డ బెల్లం, పటిక

Satyam NEWS

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలి

Satyam NEWS

కోలాహ‌లం: అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్య‌ర్ది నామినేష‌న్ ఘ‌ట్టం…..!

Satyam NEWS

Leave a Comment