Slider తెలంగాణ

బహిర్భూమికి వెళ్లినందుకు పేదవాడికి జరిమానా

pjimage (6)

పాపం అతను ఎంతో పేదవాడు. రోజు కూలి చేసుకుని బతికేవాడు. అయితే గ్రామంలో బహిరంగ మలమూత్ర విసర్జన చేసాడని అతనిపై భరించలేని జరిమానా విధించారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం విఠలపూర్ గ్రామములో జరిగిందీ ఘటన. ఆ గ్రామానికి చెందిన  తలరి నర్సప్ప అనే వ్యక్తి బహిర్భూమికి వెళ్లడంతో పంచాయతీ కార్యదర్శి  అతనికి 500 రూపాయల జరిమానా విధించారు.తాను చేసిన పని నేరమని అప్పటి వరకూ అతనికి తెలియదు. ఆతర్వాత జరిమానా చూసి తెలుసుకున్న ఆ వ్యక్తి గత్యంతరం లేక వేసిన జరిమానాను కట్టి రసీదు తీసుకున్నాడు.నిన్న మొన్నటి వరకు హరితహారంలో నాటిన మొక్కలను తిన్నందుకు మేకలకు, పశువులకు జరిమానాలు విధించిన అధికారులు ఇక ఇప్పుడు బహిర్భూమికి వెళ్లిన మనుషులకు జరిమానాలు మొదలు పెట్టారు.

Related posts

ఏవి స్వామీ నీవు చెప్పిన విలువలు?

Satyam NEWS

చట్టసభల నిర్వహణ కత్తిమీద సాము

Satyam NEWS

నదుల అనుసంధానంపై చంద్రబాబు అసత్యప్రచారం

Satyam NEWS

Leave a Comment