34.2 C
Hyderabad
April 23, 2024 14: 45 PM
Slider ప్రత్యేకం

దటీజ్ మోడీ: అరుణ్ శౌరీని పరామర్శించిన ప్రధాని

modi showri

తలకు గాయంతో పూనేలోని రూబీ హాల్ క్లీనిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరీని ప్రధాని నరేంద్ర మోడీ నేడు పరామర్శించారు. ఈ నెల 1వ తేదీన అరుణ్ శౌరీ తన ఇంట్లో కాలుజారి పడటంతో తలకు తీవ్రమైన గాయం అయింది. దాంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు.

తల భాగంలో దెబ్బ తగలడం, ఇంటర్నల్ ఇంజరీ ఉండటంతో అరున్ శౌరీ ఆరోగ్యం క్షీణించింది. అయితే ఆసుపత్రిలో చికిత్స అందించడంతో ఆయన కోలుకున్నారు. పూనేలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాన నరేంద్ర మోడీ అరుణ్ శౌరీని పరామర్శించారు. ఆసుపత్రిలో ఆయనతో దాదాపు 15 నిమిషాల పాటు ప్రధాని గడిపారు.

ప్రధానితో మాట్లాడేందుకు అరుణ్ శౌరీ ఎంతో ఆసక్తి చూపారు. అరుణ్ శౌరీ చాలా కాలంగా నరేంద్రమోడీ విధానాలను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత ఆయన ను వ్యతిరేకించిన బిజెపి సీనియర్ నాయకులలో అరుణ్ శౌరీ ఒకరు. నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఆయన విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అరుణ్ శౌరీ, నరేంద్ర మోడీ ఇప్పటి వరకూ ఒక్క సారి కూడా కలుసుకోలేదు.

ఇందిరా గాంధీ ఎమర్జన్సీ విధించిన రోజుల కన్నా ఘోరమైన రోజులు నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత వచ్చాయని అరుణ్ శౌరీ తీవ్రంగా ఆరోపణ చేశారు. లోక్ సభ ఎన్నికల ముందు కూడా అరుణ్ శౌరీ దేశ ప్రజలకు పిలుపునిచ్చి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలన్నారు. మమతా బెనర్జీ అయితే ఈ దేశానికి సరైన ప్రధాని కాగలరని కూడా అరుణ్ శౌరీ చెప్పారు.

రఫాల్ ఎయిర్ క్రాఫ్ట్ డీల్ పై కూడా అరుణ్ శౌరీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. మరో సీనియర్ బిజెపి నాయకుడు యశ్వంత్ సిన్హా, ప్రముఖ లాయర్ ప్రశాంత్ భూషణ్ తో కలిసి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా వేశారు. ఆ కేసును సుప్రీంకోర్టు కొట్టేసి ప్రధానికి క్లీన్ చిట్ఇచ్చింది. ఇంత చేసినా కూడా అరుణ్ శౌరీ అనారోగ్యంతో ఉన్నారని తెలియడంతో ప్రధాని మోడీ ఆయనను కలిసి పరామర్శించి వచ్చారు. దటీజ్ మోడీ.

Related posts

అమిత్ షా ను కలసిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

Satyam NEWS

పకడ్బందీగా కంటివెలుగు

Murali Krishna

రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

Leave a Comment