Slider జాతీయం ముఖ్యంశాలు

రైతులకు నెలకు రూ.3000 మోడీ పెన్షన్

Modi farmers

దేశంలోని రైతుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కిసాన్ మాన్ ధన్ నేడు జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రారంభిస్తున్నారు. ఈ కొత్త స్కీం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 5 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు నెలకు రూ.3000 చొప్పున పెన్షన్ అందనుంది. 60 ఏళ్లు నిండిన రైతులకు ఇది వర్తిస్తుంది. 18 ఏళ్ల నుంచీ 40 ఏళ్ల వయసున్న రైతులు కిసాన్ మాన్ ధన్ యోజన కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీం కింద రైతులు నెలకు రూ.55 నుంచీ రూ.200 వరకూ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతులు ఈ స్కీంలో చేరినప్పుడు వాళ్ల వయసు ఎంత ఉంటుందో, దాన్ని బట్టీ నెలకు ఎంత చెల్లించాలో అధికారులు డిసైడ్ చేస్తారు. 60 ఏళ్లు వచ్చే వరకూ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రైతులు ఎంత ప్రీమియం చెల్లిస్తారో… అంతే డబ్బును కేంద్ర ప్రభుత్వం కూడా నెల నెలా పెన్షన్ ఫండ్‌గా వేస్తుంది. ఉదాహరణకు 40 ఏళ్లు ఉన్న ఓ రైతు… నెలకు రూ.200 చొప్పున అంటే ఏడాదికి రూ.2,400 చొప్పున… 20 ఏళ్లు (మొత్తం రూ.48,000) చెల్లిస్తే… కేంద్రం కూడా రూ.48,000 చెల్లిస్తుంది. ఆ రైతుకు 60 ఏళ్లు రాగానే… నెలకు పెన్షన్ కింద రూ.3000 ఇస్తారు. పీఎం-కిసాన్ స్కీం ద్వారా లబ్ది పొందుతున్నవారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. తద్వారా… వచ్చే డబ్బులో నెల నెలా కొంత మొత్తం ఆటోమేటిక్‌గా కట్ అయి… ప్రీమియం కిందకు వెళ్లిపోతుంది. పీఎం-కిసాన్ ఫండ్ ద్వారా ప్రీమియం చెల్లించడం ఇష్టం లేని రైతులు… కామన్ సర్వీస్ సెంటర్స్ ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు.

Related posts

రోడ్డు విస్తరణ పనులకు స్టాండింగ్ కమిటి గ్రీన్ సిగ్నల్

Satyam NEWS

ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మానవహారం

Satyam NEWS

ప్రయివేటు వ్యక్తులకు అప్పగించేందుకే ఇలా

Satyam NEWS

Leave a Comment