39.2 C
Hyderabad
April 23, 2024 16: 26 PM
Slider సినిమా

విశ్వవిఖ్యాత గాయకుడిని పిలిచి అవమానించిన ప్రధాని మోడీ

spbalu

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని కొద్దిరోజుల కిందట ప్రధాని నరేంద్రమోడీ తన నివాసంలో చిలన చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర కళాకారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బాలీవుడ్ హీరోలు, పలువురు సెలెబ్రిటీలు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, కంగన రనౌత్, సోనమ్ కపూర్ తదితరులు దీనికి హాజరయ్యాురు. ప్రధాని మోడీతో సెల్ఫీలు దిగారు. దీనికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. టాలీవుడ్ నుంచి నిర్మాత దిల్ రాజు, లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో దక్షిణాది చిత్ర పరిశ్రమను చిన్నచూపు చూశారని మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన ఆవేదన వ్యక్తం చేశారు. మోడీని ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారు. దీనిపై చిత్ర పరిశ్రమలో చెలరేగిన దుమారం తగ్గక ముందే ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నివాసంలో బాలీవుడ్ స్టార్ హీరోలకు ఒకరకంగా తమ లాంటి కళాకారులను ఇంకోరకంగా ట్రీట్ చేశారని, వివక్షను చూపారని చెప్పారు. ప్రధాని నివాసానికి చేరుకోవడానికి ముందే అక్కడి భద్రతా సిబ్బంది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా కొందరు కళాకారులు, చిత్ర పరిశ్రమకు చెందిన టెక్నీషియన్ల సెల్ ఫోన్లను లాక్కుని, టోకెన్లు ఇచ్చారు. భద్రతా చర్యల్లో భాగంగా అందరి సెల్ ఫోన్లను తీసుకుని ఉండొచ్చని తాను భావించానని, తీరా చూస్తే స్టార్ హీరోలు, బాలీవుడ్ కు చెందిన కొందరు సినీ ప్రముఖుల చేతుల్లో సెల్ ఫోన్లు కనిపించాయని అన్నారు. అవే సెల్ ఫోన్లతో బాలీవుడ్ సెలెబ్రెటీలు నరేంద్ర మోడీతో సెల్ఫీలు దిగారని చెప్పారు.

Related posts

మిస్ ఫైర్: తలలోకి బెల్లెట్ దూసుకెళ్లి పోలీసు మృతి

Satyam NEWS

పల్నాడు ప్రాంతంలో వీరుల ఆరాధనోత్సవాలు

Satyam NEWS

వర్గీకరణ బిల్లు కోసం వనపర్తిలో ఒంటి కాలు పై నిరసన

Satyam NEWS

Leave a Comment