37.2 C
Hyderabad
April 18, 2024 19: 30 PM
Slider జాతీయం ముఖ్యంశాలు

రాహుల్ మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండు

Sonia_Rahul

కోర్టు ధిక్కరణ కేసులో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రఫేల్‌ వ్యవహారంపై స్పందిస్తూ ప్రధాని మోదీని ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అంటూ రాహుల్‌ గాంధీ విమర్శించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కూడా రఫేల్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టిందని కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వాస్తవానికి భిన్నంగా రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బిజెపి నాయకురాలు మీనాక్షి లేఖీ ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు రాహుల్‌ గాంధీని సున్నితంగా హెచ్చరించింది. ‘మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించింది. ఆయన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీం వ్యాఖ్యలకు రాహుల్‌ క్షమాపణలు చెప్పారు. ఆయన క్షమాపణలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అనంతరం వాదనలను ముగించింది.

Related posts

వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన జగన్ రెడ్డి

Satyam NEWS

జనసేనకు 24 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లు ఖరారు?

Satyam NEWS

ధరణి సమస్యల అధ్యయనం పరిష్కారం పై సమీక్ష: మంత్రి హరీశ్ రావు

Satyam NEWS

Leave a Comment