40.2 C
Hyderabad
April 24, 2024 17: 02 PM
Slider ముఖ్యంశాలు

55 రాజ్యసభ ఖాళీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

kvp kk

దేశంలో ఖాళీ కాబోతున్న 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు విడుదల చేసింది. మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 4, తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఖాళీల కోసం మార్చి 6న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. మార్చి 13 వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.

మార్చి 16న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. మార్చి 18 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉంటుంది. అవసరం అయితే మార్చి 26న రాజ్యసభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది. ఏపీ నుంచి ఎమ్ఏ. ఖాన్, టి. సుబ్బిరామిరెడ్డి, కె. కేశవరావు, తోట సీతారామలక్ష్మి రిటైర్ కాబోతున్నారు. అదే విధంగా తెలంగాణ నుంచి కేవీపీ రామచందర్ రావు, గరికపాటి మోహన్ రావు రిటైర్ కాబోతున్నారు.

Related posts

విజయవంతంగా తిరుమలలో పల్స్ పోలియో

Satyam NEWS

ఆసిఫాబాద్ ఎన్ కౌంటర్ నిజం కాదని మావోల ప్రకటన

Satyam NEWS

వెంకటగిరి కోవిడ్ సెంటర్ కు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ వితరణ

Satyam NEWS

Leave a Comment