37.2 C
Hyderabad
April 19, 2024 13: 42 PM
Slider ముఖ్యంశాలు

రామన్ ఎఫెక్ట్ : మద్య ప్రభావం ఎంత ? మద్యంపై ప్రభావం ఎంత?

raman effect

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

సివి రామన్ కి, మద్యపానానికి సంబంధించి ఒక గమ్మత్తయిన సన్నివేశం ఉంది. అది చెప్పాలంటే ఆయన కనుక్కున్న ’రామన్ ప్రభావం ’ గురించి ఒకసారి చెప్పుకోవాలి. పారదర్శకమైన ఒక ద్రవ, వాయు, ఘన పదార్ధాల నుంచి కాంతి ప్రసరిస్తున్నప్పుడు, ఆ పదార్థంలో కాంతి పరిక్షేపణం చెందుతుంది.

మామూలుగా అలా పరిక్షేపణం చెందిన కాంతి తరంగదైర్ఘ్యం పదార్థంలోకి ప్రసరించిన కాంతి తరంగదైర్ఘ్యంతో సమానం అవుతుంది. కాని కొంత భాగం కాంతి మాత్రం మూలంలో లేని వేరే తరంగదైర్ఘ్యం కలిగి ఉంటుంది. తరంగదైర్ఘ్యంలో ఈ మార్పునే రామన్ ప్రభావం రామన్ ఎఫెక్ట్ అంటారు. తరంగదైర్ఘ్యం లో వచ్చే మార్పులు చాలా బలహీనమైనవి.

కాంతి తీక్షణత లో ఇలా తరంగదైర్ఘ్యం మారిన కాంతి తీక్షణత లక్షలో ఒకటో వంతు మాత్రమే ఉంటుంది. తరంగదైర్ఘ్యంలో వచ్చే మార్పు ఆ కాంతి ప్రసరించిన పదార్థ లక్షణం మీద ఆధారపడుతుంది. కనుక ఈ ప్రభావం సహాయంతో పదార్థాలని విశ్లేషించడానికి వీలవుతుంది.

ఈ ప్రభావాన్ని కనుక్కున్నందుకు రామన్ కి 1930 లో భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. వైజ్ఞానిక రంగంలో శ్వేత జాతీయులకు మాత్రమే నోబెల్ బహుమతి ఇచ్చేవారు. శ్వేత జాతి కాని వారికి నోబెల్ రావడం అదే మొదటిసారి. సర్ సీ వీ రామన్ శుద్ధ శోత్రీయ కుటుంబం నుంచి వచ్చారు.

అందువల్ల మందు అదేనండీ ఆల్కాహాల్ తీసుకునేవారు కాదు. అయితే విదేశీయులతో తరచూ ఆయనకు చర్చలు ఉండేవి. వారు విందులు ఇచ్చేవారు. అలాంటి విందులకు రామన్ వెళ్లాల్సి వచ్చేది. ఆ విందుల్లో ఆల్కహాల్ కచ్చితంగా ఉండేది. అయితే రామన్ ఆల్కహాల్ ముట్టుకునే వారు కాదు.

ఒకసారి ఒక విందులో ఆ విందుని ఇచ్చిన పెద్దమనిషి ఎలాగైనా కొంచెం రుచి చూడమని రామన్ ని బలవంత పెట్టారట. అప్పుడు దానికి రామన్ సమాధానం చెప్పారు. ఆ సమాధానం విన్న తర్వాత మరింకెప్పుడూ ఆయనే కాదు మరెవరూ కూడా రామన్ ను మందు తీసుకోమని అడగలేదు.

ఆయన ఏం చెప్పారనేగా మీ సందేహం. అదే చెబుతున్నా.”నాకు ఆల్కహాల్ లో రామన్ ఎఫెక్ట్ గురించి తెలుసుకోవాలనుంది గాని, రామన్ మీద ఆల్కహాలు ఎఫెక్ట్ తెలుసుకోవాలని లేదు.” దటీజ్ రామన్.

Related posts

స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంపై రాష్ట్రపతికి చంద్రబాబు ఫిర్యాదు

Satyam NEWS

అయ్యప్పస్వామి మండల పూజకు రావుల సహకారం

Satyam NEWS

మడమ తిప్పని నాయకత్వమా.. ఓ సారి తిరిగి చూడు

Satyam NEWS

Leave a Comment