36.2 C
Hyderabad
April 25, 2024 20: 17 PM
Slider ముఖ్యంశాలు

మూత్ర‌నాళ వ్యాధికి అధునాత‌న‌ శ‌స్త్రచికిత్స

rare surgery

రంగారెడ్డి జిల్లా జ‌గ‌ద్గీరిగుట్టకు చెందిన‌ చిన్నారి ఏడు సంవ‌త్స‌రాల ఉమ్మె రుమాన్ ఖ‌తూన్ కు శ‌రీరంలో కుడివైపు త‌ర‌చు నొప్పి వచ్చేది. ఈ స‌మ‌స్య‌తో అవేర్ గ్లెనిగ‌ల్స్ గ్లోబ‌ల్ హాస్పిట‌ల్స్‌లో చేర్చారు. స‌మ‌గ్రంగా రోగ నిర్ధార‌ణ చేసిన అనంత‌రం ఏజీజీహెచ్ వైద్యులు ఖ‌తూన్ మూత్ర‌నాళంలో 9 మిల్లీమీట‌ర్ల రాయి ఉంద‌ని కనుగొన్నారు.

వెంట‌నే రాయి తొల‌గించ‌డం ద్వారా సాధార‌ణ స్థితికి తీసుకురావ‌చ్చున‌ని గుర్తించారు. అవేర్ గ్లెనిగ‌ల్స్ గ్లోబ‌ల్ హాస్పిట‌ల్స్ చిన్నారుల మూత్ర‌పిండాల్లో సంభ‌వించే ఈ రాళ్ల స‌మ‌స్య‌కు అధునాత‌న శ‌స్త్రచికిత్స‌ చేసే పూర్తి మౌలిక స‌దుపాయాలు, నైపుణ్య‌వంతులైన వైద్యుల‌ను కలిగి ఉంది. చిన్న వ‌య‌సులో చేసే శ‌స్త్రచికిత్సల‌కు స‌రైన నైపుణ్యాలు క‌లిగిన వైద్యుల సేవ‌లు పొందాలి, లేదంటే జీవితాంతం ప‌లు స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవ్వాల్సి ఉంటుంది.

చికిత్స చేసే వైద్యుల‌కు చిన్నారులు, యుక్త‌వ‌య‌సులోని వారి మూత్ర‌నాళాల‌కు సంబంధించిన అంశాల‌పై స‌మ‌గ్ర ప‌రిజ్ఞానం ఉండాలి. నైపుణ్యంతో మెరుగైన చికిత్స అందించే మౌలిక స‌దుపాయ‌లు సైతం అంతే ముఖ్య‌మైన‌వి. రోగికి సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న‌తో చికిత్స అందించ‌డంతో పాటుగా చికిత్స అనంత‌ర ప‌రిణామాలు, వాటిని ఎదుర్కునేందుకు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

ఇవన్నీ ఉండటం వల్ల ఈ శస్త్ర చికిత్సను విజయవంతంగా చేశామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ సంక్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స గురించి అవేర్ గ్లెనిగ‌ల్స్ గ్లోబ‌ల్ హాస్పిట‌ల్స్ సీఓఓ డాక్ట‌ర్ మెర్విన్ లియో మాట్లాడుతూ, గ‌తంలో చిన్నారుల  మూత్ర‌పిండాల్లో రాళ్లు స‌మ‌స్య అరుదుగా ఉండ‌గా, గ‌త ప‌ది సంవత్స‌రాల కాలంలో ఈ త‌ర‌హా  ఆరోగ్య స‌మ‌స్య‌లు తర‌చుగా సంభ‌విస్తున్నాయని అన్నారు.

ప్ర‌పంచ జ‌నాభా పెరుగుతున్న‌ట్లే, వ్యాధుల్లో సైతం పెరుగుద‌ల క‌నిపిస్తోందని, జీవ‌న‌శైలి, ఆహార‌పు అల‌వాట్ల‌లో మార్పులు ఈ ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు ప్ర‌ధాన కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు అని వెల్ల‌డించారు. ఈ చిన్నారికి చికిత్స అందించిన అవేర్ గ్లెనిగ‌ల్స్ గ్లోబ‌ల్ హాస్పిట‌ల్ క‌న్స‌ల్టెంట్ యూరాల‌జిస్ట్ డాక్ట‌ర్ బి.ల‌క్ష్మ‌ణ్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, తీవ్ర‌మైన నొప్పితో బాధ‌ప‌డుతున్నీ ఖ‌తూన్‌కు వివిధ ప‌రీక్ష‌ల అనంత‌రం 9 మిల్లీమీట‌ర్ల రాయి ఉంద‌ని, దాన్ని తొల‌గించేందుకు శ‌స్త్రచికిత్స మాత్ర‌మే ప‌రిష్కార‌మ‌ని గుర్తించామని చెప్పారు.

రెట్రోగ్రేడ్ ఇంట్రారెన‌ల్ స‌ర్జ‌రీ(ఆర్ఐఆర్ఎస్‌) అనే అధునాత‌న శ‌స్త్రచికిత్స విధానంలో ఫైబ‌రాప్టిక్ ఎండోస్కోప్ పేరుతో పిల‌వ‌బ‌డే ట్యూబ్ ద్వారా ఈ రాయిని తొల‌గించ‌డానికి నిర్ణ‌యించాం. ఓపెన్ స‌ర్జరీ కంటే ఆర్ఐఆర్ఎస్ శస్త్రచికిత్స విధానంలో అనేక సానుకూల అంశాలు ఉన్నాయి. రోగి స‌మ‌స్య‌కు త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్కారం దొరుకుతుంది, శ‌స్త్రచికిత్స అనంత‌రం రోగి ఎదుర్కునే నొప్పి తీవ్రంగా త‌గ్గుతుందని అన్నారు. మూత్ర‌పిండంలోని రాళ్ల‌ను ఈ ఎండోస్కోప్ ద్వారా గుర్తించి అక్క‌డే విచ్చిన్నం చేయ‌డం లేదా క‌రిగించి మూత్రం ద్వారా వెలుప‌లికి వ‌చ్చేలా చేయ‌డం లేదా చిన్న భాగాలుగా చేసి బ‌య‌టికి పంపేలా చేస్తుంది. ఆర్ఐఆర్ఎస్ విధానాన్ని నిపుణుడైన యూరాల‌జిస్ట్ (ఎండోయూరాల‌జిస్ట్‌) సమక్షంలో మాత్ర‌మే చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని జ‌న‌ర‌ల్ లేదా స్పైన‌ల్ అన‌స్తీషియా ద్వారా చేస్తారని డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ వివ‌రించారు.

Related posts

“ఆత్మ” బంధువు

Satyam NEWS

Target Killer: అనంత్ నాగ్ జిల్లాలో లష్కరే ఉగ్రవాది హతం

Satyam NEWS

కేంద్ర పథకాలను తన పేరుతో వాడుకుంటున్న కేసీఆర్

Satyam NEWS

Leave a Comment