30.7 C
Hyderabad
April 24, 2024 02: 04 AM
Slider సినిమా

ఇప్పుడు కిక్ అయిపోయింది క్రాక్ గా వచ్చేస్తున్నాడు

raviteja-krack

కిక్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన మాస్ మహారాజ రవితేజ ఇప్పుడు క్రాక్ గా రాబోతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ గ్రాండ్ గా లాంచ్ అయింది. రవితేజ 66వ చిత్రంగా రాబోతున్న ఈ కొత్త చిత్రం క్రాక్ హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభం అయింది. సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్ పై బి మధు ప్రొడ్యూసర్ చేస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో దిల్ రాజు, డి సురేష్ బాబు ఎన్ వి ప్రసాద్, సురేందర్ రెడ్డి, రాఘవేంద్రరావు, అల్లూ అవరవింద్ సుధాకర్ రెడ్డి, నవీన్ ఎర్నేని, పరుచూరు బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. దిల్ రాజు సురేందర్ రెడ్డి స్క్రిప్టు అందించారు. ఈ చిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ గా నటిస్తున్నాడు. రవితేజ నటిస్తున్న ఈ చిత్రం పవర్ చూపించాలనుకున్న దర్శకుడు తొలి రోజే టైటిల్ తో బాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నది.

Related posts

కొత్త సంవత్సరంలో తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్ వరాలు

Satyam NEWS

జగనన్న వసతి దీవెన` న‌గ‌దు విడుద‌ల‌…!

Satyam NEWS

కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన

Satyam NEWS

Leave a Comment