28.7 C
Hyderabad
April 24, 2024 04: 13 AM
Slider సంపాదకీయం

రియాక్షన్: సత్యం న్యూస్ వెలికితెచ్చిన సమస్య పరిష్కారం

sa news

పోస్టింగూ పోస్టింగూ గాలికి కొట్టుకుపోయావా? అంటూ సత్యం న్యూస్ జనవరి 18న ఒక పోస్టు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 55 మంది డిఎస్ పి స్థాయి పోలీసు అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వడం లేదని, దాదాపుగా ఆరు నెలలుగా వీరంతా ఖాళీగానే ఉన్నారని సత్యం న్యూస్ వెలికి తెచ్చింది. ఇప్పుడు ఆ 55 మందిలో సుమారుగా 49 మందికి ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చేసింది.

సత్యం న్యూస్ వెలిచి తెచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది. ఈ 55 మంది పోలీసు అధికారులను కులం పేరుతో పోస్టింగులు నిలిపివేసిన విషయాన్ని సత్యం న్యూస్ వెలికి తెచ్చిన విషయం తెలిసిందే. పాఠకుల సౌకర్యార్ధం సత్యం న్యూస్ ఆనాడు ఇచ్చిన వార్తను యథాతధంగా ఇక్కడ ఇస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 55 మంది డిఎస్ పి ఆ పై స్థాయి పోలీసు అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వడం లేదు. దాదాపుగా ఆరు నెలలుగా వీరంతా ఖాళీగానే ఉన్నారు. రాష్ట్రంలో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి మొత్తం 90 మంది పోలీసులు ఉన్నతాధికారులకు పోస్టింగులు నిలిపేశారు.

అయితే రెండు మూడు నెలల నుంచి కొందరు అధికారులు వత్తిడి చేయడంతో 35 మంది వరకూ పోస్టింగులు ఇచ్చేశారు. వత్తిడి చేసి పోస్టింగులు తెచ్చుకున్న వీరందరినీ అప్రధానమైన పోస్టులలోనే నియమించారు. మన సమర్థతను వాడుకోకపోతే సమాజానికే నష్టం మనకేంటి అనే ఉద్దేశ్యంతో ఈ 35 మంది పోలీసులు అధికారులు సర్దుకు పోయి పని చేసుకుంటున్నారు.

అయితే మరో 55 మంది డిఎస్ పి లు, అదనపు ఎస్ పిలు, నాన్ క్యాడర్ ఎస్ పిలు ఇప్పటికీ పోస్టింగ్ లేకుండా ఉన్నారు. పైస్థాయికి వచ్చిన ఈ అధికారులు పోస్టింగ్ కోసం ఎదురు చూడటం ఒక రకంగా రాష్ట్రానికి నష్టం. జీతం భత్యం తీసుకుంటూ ఊరికనే కూర్చోవడం ఈ అధికారులకు కూడా ఇష్టం లేదు. అయితే ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకపోతే ఏం చేయాలి?

సమర్ధత ఉన్నా, సర్వీసు రికార్డులో ఎలాంటి మచ్చ లేకున్నా పోస్టింగ్ రాకపోతే ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియక ఆ పోలీసు ఉన్నతాధికారులు ఏం చేయలేకపోతున్నారు. ఎన్నో సమస్యలు పరిష్కరించిన ఈ పోలీసు ఉన్నతాధికారుల సమస్య తీరేది కాదని వారికే అర్ధం అయిపోయింది.

ఎందుకంటే తమకు పోస్టింగులు ఇవ్వకపోవడానికి ఎవరో కంప్లయింట్ చేశారనో, అవినీతి చేసి దొరికారనో కాదు. తమ కులం చూసి పోస్టింగులు ఆపారని ఈ పోలీసు ఉన్నతాధికారులకు తెలుసు. అందుకే ఏం చేయలేని, ఏం పరిష్కారం లేని ఈ సమస్య గురించి ఆలోచించడం మానేసి ఈ పోలీసు అధికారులు ఖాళీగా కూర్చున్నారు.

పుట్టిన కులం మార్చుకునే వీలు లేదు కదా? మరి ఇంకేం చేయాలి? అందుకే సమస్యను కాలానికి వదిలేసి ఈ పోలీసు ఉన్నతాధికారులు ఖాళీగా కూర్చున్నారు. వీరంతా కమ్మ, కాపు కులాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు. అకస్మాత్తుగా డిపార్టుమెంటులోకి వచ్చిన వారు కూడా కాదు. 20, 25 ఏళ్లు సర్వీసు నిండిన వారు. ఇప్పుడు కులం ఎలా మార్చుకోవాలో తెలియడం లేదు వీరికి. వీరిలో 25 మంది కమ్మ కులానికి చెందిన వారు, 14 మంది కాపు కులానికి చెందిన వారు. మిగిలిన వారు వేరే అగ్రకులాల వారు. ఇదీ ఆనాడు సత్యం న్యూస్ ఇచ్చిన వార్త.

Related posts

ధరల పెంపుపై బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం

Satyam NEWS

అన్ని కమర్షియల్ అంశాలతో “రాజయోగం” ట్రైలర్

Bhavani

నిర్నీత గడువులోగా లే అవుట్లకు అనుమతులు

Bhavani

Leave a Comment