35.2 C
Hyderabad
April 24, 2024 12: 43 PM
Slider సంపాదకీయం

రెలిజియనిజం: లక్ష్మణ రేఖ దాటిన అంధ మత విశ్వాసం

MJ Market

అంధ మత విశ్వాసాలు, మతమౌఢ్యం మానవత్వానికి ముప్పు తెస్తాయని పెద్దలు చెప్పిన మాట ఇప్పుడు కళ్ల ముందు సాక్ష్యాత్కారమైంది. ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ విజృంభించి మానివాళిని కబళిస్తుంటే మనిషి నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది.

ఒకరినొకరు తాకరాదని, వేరొకరితో కరచాలనం కూడా చేయరాదనే నిబంధనలు పుట్టుకొచ్చాయిచ్చాయి. మనుషుల మధ్య 4 అడుగుల భౌతిక దూరం ఉండాలనే లక్ష్మణ రేఖ గీసుకుని బతుకుతున్న రోజుల్లో ఇస్లాం మత వ్యాప్తికి పాటుపడే తబ్లిగీ జమాత్ మత ప్రచారానికే ప్రాధాన్యతనిచ్చింది తప్ప కరోనా ఆంక్షలకు కాదు.

200 మంది కన్నా ఎక్కువ గుమికూడవద్దు అని ఢిల్లీ ప్రభుత్వం నెత్తి నోరూ బాదుకుని చెప్పినా మర్కజ్ మసీదులో తలుపులు వేసుకుని వేలాది మంది తమ మతాన్ని ఎలా వ్యాప్తి చేయాలా అని పథకాలు వేసుకున్నారు. కరోనా బారి నుంచి తట్టుకుని మనిషి బతికి ఉంటే కదా మతం గురించి ఆలోచించేదనే కామన్ క్వశ్చన్ కూడా వారి మదికి రాలేదంటే దాని అర్ధం ఏమిటి?

పశ్చిమ నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదు తబ్లిగీ జమాత్ కు కేంద్ర స్థావరం. ఇస్లాం మతాన్ని ఎలా వ్యాప్తి చేయాలా అనేదే వారి ఆలోచన. అందుకే దేశం నలుమూలల నుంచి ఎంపిక చేసుకున్న ముస్లిం లను పిలిచారు. వీరంతా మదర్సాలు నడిపే వారు, మసీదుల్లో పని చేసే వారు అయితే ఏదో ట్రెయినింగ్ ఇస్తున్నారులే అనుకోవచ్చు.

తబ్లిగీ జమాత్ ఆహ్వానాలు పంపి వారికి దారి ఖర్చులు ఇచ్చి పిలిపించుకున్న వారిలో రోజు వారీ వ్యాపారాలు చేసేవారు, ఉద్యోగాలు చేసేవారు కూడా ఉన్నారు. దీని అర్ధం ఏమిటి?

దేశ రాజధాని నగరంలో ఇంత జరుగుతుంటే కళ్లు మూసుకు కూర్చొన్న ప్రభుత్వాలను ఏమనాలి? నయానో భయానో వారిని చెదరగొట్టాలి. లేదా వారందరిని గదిలో బంధించి బయటకు రాకుండా చూడాలి. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించాలి. అయితే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ వారితో మాట్లాడుతూ ఉన్నాయి తప్ప చర్యలకు దిగలేదు.

ఈ కారణమే ఇప్పుడు దేశానికి, మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు తీసుకువచ్చింది. దేశంలో పండుగలన్నీ రద్దు చేశారు. ప్రధాన దేవాలయాలు మూసివేశారు. అయినా హైదరాబాద్ లోని ఒక్క చిన్న మసీదు నుంచి మర్కజ్ మసీదు వరకూ కూడా సామూహిక ప్రార్ధనలు ఆగలేదు.

ముస్లిం మత పెద్దలు నెత్తీనోరూ బాదుకుని చెప్పారు. కలిసి నమాజు చేయవద్దు అని. అయినా ఎవరూ వినలేదు. పర్యవసానం మనం చూస్తున్నాం. లాక్ డౌన్ ఉన్నప్పుడు విదేశాల నుంచి వచ్చిన ముస్లిం మత ప్రవక్తలను ట్రాక్ చేయాల్సిన అవసరం ఇంటెలిజెన్సు పోలీసులకు లేదా?

దేశంలో ఆరోగ్య అత్యాయక పరిస్థితి నడిచే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పాలా? ఇది ఇంటెలిజెన్సు ఘోర వైఫల్యం అని అన్నా అనుకోవాలి లేదా తెలిసి కూడా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని అయినా అనుకోవాలి.

ఈ రెంటిలో ఏది కరెక్టో ప్రభుత్వమే చెప్పాలి. దక్షిణాది రాష్ట్రాలలో మర్కజ్ మసీదు ప్రార్ధనల్లో పాల్గొని వచ్చిన వారితో నిన్న ఒక్క సారిగా కరోనా పాజిటీవ్ కేసులు ఆకాశాన్ని తాకాయి. అయినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రులు బహిరంగంగా వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పలేదు.

ఇలా చేయడం తప్పు అని ముస్లింలకు చెప్పలేదు. గుంటూరు జిల్లా కలెక్టర్ ఈ సంఘటన జరగగానే ఒక ప్రకటన జారీ చేశారు. మర్కజ్ మసీదుకు వెళ్లిన వారు మర్యాదగా వచ్చి లొంగిపోతే చికిత్స అందిస్తామని, తాము వెతికి పట్టుకుంటే కేసులు పెడతామని. ఈ మాత్రం చొరవ కూడా రాజకీయ నాయకులు చేయలేదు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అయితే దయచేసి బయటకు రండి… దయచేసి బయటకు రండి అని బతిమాలుకున్నారు తప్ప వెతికి పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని చెప్పలేదు. కరోనా విపత్తు సమయంలో కూడా తుచ్ఛమైన రాజకీయాలు చేసుకుంటూ బతకడమే మన సమాజానికి అలవాటైపోయింది. ఇది చదివిన తర్వాత కూడా రాసిన వాడిది ఏ మతం? ఏ పార్టీ? అనే చూస్తారు తప్ప తప్పు సరిదిద్దుకోరు. అదే మన ఖర్మ.

Related posts

భారత నిఘా క్వాడ్ కాప్టర్ ను కూల్చిన పాకిస్తాన్

Satyam NEWS

మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం

Satyam NEWS

ఆచార్యుడు, ఆరాధ్యుడు

Satyam NEWS

Leave a Comment