రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ జంటగా యు.వీ క్రియేషన్స్ పతాకం పై వంశీ, ప్రమోద్, విక్రమ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం సాహో. యంగ్ డైరెక్టర్ సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే సైకో సయ్యానా అంటూ యావత్ దేశాన్ని ఉర్రూతలుగించిన ఈ చిత్ర బృందం ఇప్పడు మరో అద్భుతమైన పాటతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఏ చోట నువ్వున్నా అంటూ మొదలయ్యే ఈ పాటకి సంబంధించిన వీడియో టీజర్ తాజాగా విడుదల చేశారు. యూరప్ లోని అందమైన లొకేషన్స్ లో ఈ పాటను చిత్రీకరించారు. ఆగస్ట్ 2న ఫుల్ లెంత్ సాంగ్ ను విడుదల చేస్తున్నారు. సాహోలో పాటలకు ఒక్కరే కాకుండా వేరే వేరే సంగీత దర్శకులు ట్యూన్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సైకో సయ్యానా పాటకు తనిష్క్ బాగ్చి సంగీతం అందించగా. ఏ చోట నువ్వున్నా పాటకు గురు రాంధ్వా సంగీతం అందించారు. అలానే హ్యాపెనింగ్ లిరిక్ రైటర్ కృష్ణ కాంత్ ఈ పాటకు సాహిత్యం అందించారు. ఇక హరిచరణ్ శేషాద్రి, తులసి కుమార్ పాటకు సింగర్స్ గా వ్యవహరించారు. ఇప్పటి వరకూ వచ్చిన సాహో ప్రమెషన్ అంతా ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా కనిపించినా ఇప్పుడు వచ్చిన ఈ పోస్టర్ లో లవ్ అండ్ రొమాంటిక్ యాంగిల్ కనిపించడం విశేషం. ఈ చిత్రం ఇండియాలో మెట్టమెదటిగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరెకెక్కుతుంది. ఈ చిత్రం అగష్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. బాహుబలి లాంటి చిత్రం తరువాత వస్తున్న చిత్రం కావటం తో రెబల్‌స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఇండియన్ సినిమా లవర్స్ అందరూ ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెబల్‌స్టార్ ప్రభాస్, శ్రధ్ధాకపూర్, జాకీషరఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మహేష్ మంజ్రేఖర్, టిను ఆనంద్, శరత్ లోహితష్వా తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
previous post
next post