27.7 C
Hyderabad
March 29, 2024 04: 23 AM
Slider సినిమా

సాయి పల్లవి మన అనుకోని అతిధి

saipallavi2

సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్ , అతుల్ కులకర్ణి నటించగా మలయాళం రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సినిమా అధిరన్. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కోసం అనువదిస్తున్న ఈ చిత్రానికి అనుకోని అతిధి అని టైటిల్ పెట్టారు నిర్మాతలు. కొన్ని రోజుల క్రితం మలయాళంలో విడుదలైన ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కేరళలో భారీ విజయం సాధించింది. ఈ చిత్రాన్ని జయంత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై దీప సురేందర్ రెడ్డి సమర్పణ లో ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ తెలుగులో అనువదిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘కేరళలో 1970లలో జరిగిన వాస్తవంగా జరిగిన ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. సాయి పల్లవితో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రకాశ్‌రాజ్, అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రభాస్‌ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందిస్తున్న జిబ్రాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు పూర్తి అయ్యి మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫస్ట్ లుక్, ట్రైలర్ రిలీజ్ చేసి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నాం అని నిర్మాతలు చెప్పారు. ప్రకాశ్‌రాజ్, అతుల్‌ కులకర్ణి , రెంజి పానికర్‌, లియోనా లిషోయ్‌, శాంతి కృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు – ఫణి కందుకూరి, మాటలు: ఎం. రాజశేఖర్‌రెడ్డి, పాటలు: చరణ్‌ అర్జున్‌, మధు పమిడి కాల్వ, ఎడిటింగ్‌: అయూబ్‌ ఖాన్‌, కెమెరా: అను మోతేదత్‌, స్ర్కీన్‌ప్లే: పి.ఎఫ్‌. మాథ్యూస్‌, నేపథ్య సంగీతం: జిబ్రాన్‌, సంగీతం: పి.ఎస్‌. జయహరి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: దక్షిన్‌ శ్రీన్వాస్, సమర్పణ: శ్రీమతి దీప సురేందర్ రెడ్డి; నిర్మాతలు: అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్; దర్శకత్వం: వివేక్‌

Related posts

గంగుల ఇంటిపై ఐ‌టి, ఈడీ సోదాలు

Murali Krishna

ధాన్యం కొనుగోలుకు అన్ని చర్యలు

Satyam NEWS

బలహీన వర్గాల మహిళలపై పెరిగిన అత్యాచారాలు

Satyam NEWS

Leave a Comment