38.2 C
Hyderabad
April 25, 2024 13: 08 PM
Slider చిత్తూరు

కరోనా నివారణకు ఇంటింటికీ శానిటైజర్లు పంపిణీ

MLA Madhu

ప్రపంచవ్యాప్తంగా భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పలు చర్యలు తీసుకుంటున్నట్లు, అందులో భాగంగా పట్టణంలోని ప్రతి ఇంటికి శానిటైజర్లు తన సొంత డబ్బుతో అందిస్తున్నట్లు స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి తెలిపారు.

శ్రీకాళహస్తి పట్టణంలో జిల్లాలోనే మొదటి కరోనా కేసు నమోదు కావడం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. కచ్చితంగా ఇంట్లోనే ఉండాలని తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే నుండి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని ఆయన కోరారు.

నిత్యావసరాలు అత్యవసరాలు కోసం ఒక గంట మాత్రమే బయట ఉండాలని, మందులు ,టీకాలు లేని కరోనా వైరస్ ను వ్యాప్తి చెందకుండా చూడడమే శరణ్యమని తెలిపారు తెలిపారు. పట్నంలోని అధికారులందరినీ అప్రమత్తం చేస్తున్నామని శానిటేషన్ కు ప్రాధాన్యత ఇవ్వాలని కోరామని తెలిపారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పడుతున్న తపన అందరూ గమనించాలని కరోనా వైరస్ నివారణకు ఉన్న అన్ని మార్గాలను అనుసరించాలని అందుకే పట్టణంలోని ప్రతి ఇంటికి వాలంటీర్లు సచివాలయ ఉద్యోగుల ద్వారా శానిటైజర్లు అందిస్తున్నారని తెలిపారు.

అదే విధంగా స్వచ్ఛంద కర్ఫ్యూ వలన జీవన ఉపాధి కోల్పోయిన వారికి ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని కార్యకర్తలు ,స్వచ్ఛంద సంస్థలు కూడా వారి కోసం పాటుపడాలని కోరారు. కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం పట్టణంలో 7 చోట్ల మార్కెట్ ఏర్పాటు చేశామని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సామాజిక దూరం పాటిస్తూ ఉపయోగించుకోవాలని కోరారు.

Related posts

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌

Satyam NEWS

ఇంటర్‌ సిటీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఈవీ ట్రాన్స్

Satyam NEWS

స్వర్ణ కవచంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి

Satyam NEWS

Leave a Comment