39.2 C
Hyderabad
April 18, 2024 17: 52 PM
Slider ఖమ్మం

సర్ ప్రయిజ్: జర్నలిస్టు మూర్తికి ఇంకా తగ్గలేదా?

surya murthy

సత్తుపల్లి ఘటనలో విలేకరులపై దాడి చేశారని ఆరోపిస్తున్న బాధితుల్లో ఒకడైన రాంచంద్రమూర్తి ‘గాయాలు గట్టిగానే అయ్యాయా? ఇంత ట్రీట్ మెంట్ జరిగిన ఇంకా మానలేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూర్తితో బాటు దాడికి గురయ్యామని చెబుతున్న బాధితులు శ్రీకాంత్ తన రోజువారి కార్యక్రమాల్లో ఉన్నాడు.

మరో బాధితుడు సత్యనారాయణ కూడా ఇంటి వద్ద రెస్ట్ తీసుకుంటున్నారు. కాగా మూర్తి మాత్రం కలెక్టర్ ని, కమిషనర్ ని కలుస్తూనే ఐసియులో విశ్రాంతి తీసుకోవడాన్ని బట్టి చూస్తే గాయాలు గట్టిగానే తగిలినట్టు అర్ధం అవుతోంది. కరోనా కరువులో కూడా మూర్తి దగ్గరికి వచ్చే పరామర్శకుల సంఖ్య బాగానే ఉందని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే పోస్టులను బట్టి అర్ధం అవుతుంది.

దాడి జరిగిందని చెప్పబడే రోజు 2వ తారీకు. ఆ రాత్రి బాగానే వుంది. రెండవ రోజు మళ్లీ పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. ఆ రోజు ఓ జర్నలిస్ట్ సంఘం మద్దతుకు వెళ్ళినపుడు ఉత్సాహంగానే ఉన్నట్టు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సంఘటన జరిగిన తర్వాత రెండో రోజు రాత్రి  వరకు స్టేషన్ లో ఉండి, మువ్వా విజయ్ బాబుపై ఫిర్యాదు ఇచ్చి,  ఎఫ్ఐఆర్ అయ్యేవరకు అక్కడే ఉన్నాడు. 80 కిలోమీటర్లు బైక్ డ్రైవ్ చేసుకుంటూ ఖమ్మం చేరుకున్నాడు. ఈ సందర్భంలో మూర్తి  బాగానే ఇబ్బంది పడ్డట్టు అర్ధం చేసుకోవచ్చు.

ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకున్న మూర్తి ఐసియు లో చికిత్స పొందేంత అవసరమే ఇప్పుడు అతని ఆరోగ్యం పట్ల అయన అభిమానులకు తీవ్ర ఆవేదన కలిగిస్తుంది. మూర్తి ఇంకా మారలేదా? ఓ పక్క కమిషనర్ ని , కలెక్టర్ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం, మీడియా వారికి ఐసియూ లోనే ఇంటర్యూలు ఇవ్వడం, చెక్కుల పంపిణీలు చెయ్యడం.

గుంపులు గుంపులుగా పరామర్శ చెయ్యడం ఆ ఆసుపత్రిలో మాత్రమే వెసులుబాటు వుండే సౌకర్యము కాబోలు. ఏదేమైనా.. ఇంత ట్రీట్మెంట్ జరిగినా మూర్తికి తగ్గక పోవడం, అయనలో మార్పు రాకపోవడం ఆలోచించాల్సిన విషయమే.

ఇప్పటికైనా ‘గట్టి ట్రీట్మెంట్’ మరోసారి చేస్తే తప్ప అయన కోలుకునే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. అయన త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.!

Related posts

రైతులను సంఘటితం చేసేందుకే సీఎం కేసీఆర్ ప్రయత్నం

Satyam NEWS

దళితులపై దాడులకు తెగబడుతున్న ఎంఐఎం గుండాలు

Satyam NEWS

ఏసు పుట్టిన ప్రాంతానికి వెళ్లేందుకు ఇజ్రాయిల్ ఆంక్షలు

Satyam NEWS

1 comment

Sylani April 7, 2020 at 9:44 AM

Murthy ki inko coating personal ga isthay baaguntundi.. journalists kuda తమకు విషేశాధికారాలున్నయని కొన్ని సార్లు వీపరీతంగా ప్రవర్తిస్తుంటారు అది కరెక్ట్ కాదు.

Reply

Leave a Comment