37.2 C
Hyderabad
March 28, 2024 17: 16 PM
Slider సినిమా

కెమెరా యాక్షన్: చిరంజీవి, నాగార్జులతో మళ్లీ మంత్రి సమావేశం

chiranjeevi

తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో నేడు మరోసారి సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చిరంజీవి, నాగార్జున ఈ సమావేశంలో పాల్గొన్నారు.

జూబ్లిహిల్స్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ సమావేశం జరిగింది. సినిమా షూటింగ్ లకు శంషాబాద్ సమీపంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు స్థలం కేటాయింపు అంశంపై చర్చ జరిపారు. 24 విభాగాల కార్మికులు, టెక్నీషన్స్ నైపుణ్యంను మరింత పెంపొందింప చేసేందుకు ఒక శిక్షణ కేంద్రం ఏర్పాటు అవసరాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. టికెట్ల ధరల సరళీకృత విధానం పాటించాలని గత సమావేశంలో పేర్కొన్నారు.

చిత్రపురి కాలనీ పక్కనే సినీ కార్మికులకు ఇండ్ల నిర్మాణానికి మరో 10 ఎకరాల స్థలం కేటాయించాలని కూడా  ప్రస్తావించారు. సినీ కార్మికులు, కళాకారుల కోసం కల్చరల్ కేంద్రం ఏర్పాటుకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో 2 ఎకరాల స్థలం కేటాయించాలని అన్నారు.

అదేవిధంగా సినీ, tv కళాకారులకు ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డులను అందజేయాలని, సినీ అవార్డుల ప్రధానం, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సినీ కార్మికులకు వర్తింపచేయాలని, Esi సౌకర్యం కల్పించాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ ను అమలు చేయాలని ప్రతిపాదించారు. వీటన్నింటిపైనా తదుపరి చర్యలు తీసుకోవడానికి రెండో సారి చర్చలు జరుపుతున్నారు.

Related posts

క్రిస్టియన్ లకు క్రిస్మస్ కానుకలు అందించిన ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS

కోటి 80 ల‌క్ష‌ల‌తో రూపుదిద్దుకుంటున్న విజయనగరం పిఎస్

Satyam NEWS

పేద ప్రజలకు అండగా సీఎం కేసీఆర్ సహాయనిధి

Satyam NEWS

Leave a Comment