28.7 C
Hyderabad
April 20, 2024 06: 57 AM
Slider కరీంనగర్

ప్రొటెక్షన్ ఫోర్స్: మహిళలకు ఆపన్న హస్తం షీ-టీమ్స్

she teams

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ని  ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల గ్రామంలో ఉన్న తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ శాఖకు చెందిన ఏకాలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో, కాలేజ్ లో  జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచనల మేరకు షీ-టీమ్ బృందం, జిల్లా సఖి బృందం విద్యార్థులకు అవగాహన  ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు.

ప్రోగ్రాంలో భాగంగా మహిళలను, విద్యార్థునిలను, యువతలను, వివిధ రకాలుగా వేధించేవారిని కట్టడి చేసేందుకు షీ టీమ్ ఏర్పాటు చేశామన్నారు. లైoగిక  వేధింపులకు పాల్పడుతున్నవారిని పట్టుకునేందుకు జిల్లా లో షీ టీం బృందం పనిచేస్తుందని షీ-టీమ్ ఇంచార్జ్ ఎస్.ఐ. మల్లేశం గౌడ్ అన్నారు.

ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థినులను లక్ష్యంగా చేసుకొని జిల్లా  షీ-టీం బృందం ఆత్మ రక్షణ పద్దతులను గురించి బోధించారు. వాస్తవిక ఘటనల స్ఫూర్తితో కళ్ళకి కట్టినట్టు చూపించారు. ఎంత మంది ఈవ్ టీసింగ్ ఎదురుకుంటున్నారు? ఎక్కడెక్కడ ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి?

ఎవరైనా చెప్పారా? మౌనంగానే భరిస్తూనే ఉన్నారా? అని తెలుసుకుంటున్నారు. అందరి ముందు సమస్యలని చెప్పుకోలేని వారు పేపర్ పై రాసి ఇవ్వాలని తెలిపారు. విద్యార్థినుల నుండి వచ్చిన ప్రశ్నలు సమాధానాలు క్రోడీకరించి వారికి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటాం అని, ధైర్యం గా ఉండమని చెప్పారు.

దారిలో వస్తున్నప్పుడు కానీ, బస్ లో వస్తున్నాపుడు కానీ అబ్బాయిలు అసభ్యకర మాటలు మాట్లాడినా, వెకిలి చేష్టలు చేసినా మొదట కుటుంబసభ్యులకు చెప్పాలి. వేధింపులు కొనసాగించడం, ఆగత్యలకి పాల్పడతారు అనే అనుమానం వస్తే షీ టీమ్ బృందం ని సంప్రదించాలి అని చెప్పారు. విద్యార్థుల కు పోస్కో యాక్ట్ గురించి వివరించారు.

డయల్ 100 తో పాటుగా వివిధ రకాల టోల్ ఫ్రీ నెంబర్లు మహిళా రక్షణ కోసం అందుబాటులో ఉన్నాయని, షీ టీమ్స్ నిరంతరం డేగ కళ్ళతో మహిళల రక్షణ కోసం పని చేస్తున్నాయని  చెప్పారు. మహిళలకు మరియు ప్రజలకు ఏ సమస్య ఉన్నా డయల్ 100, రాజన్న సిరిసిల్ల జిల్లా  టీమ్ వాట్సాప్ నెంబర్ 7901132141 లకు, దేశవ్యాప్తంగా ప్రస్తుతం 112, 1090, 1091 ఫోన్ నెంబర్ లు  అందుబాటులో ఉన్నాయి.

వీటికి ఫోన్ చేసి,సహాయం పొందవచ్చు. పై నంబర్లలో  ఏదో ఒకదాని ఫోన్ చేసి తాము ప్రమాదం లో ఉన్న సమాచారాన్ని అందిస్తే రక్షణ పొందే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 181 నెంబర్  కి కాల్  చేసిన  బాధితులకు సాయం అందుతుంది. ఈ ప్రోగ్రాం లో షీ-టీమ్ ఇంచార్జ్ ఎస్.ఐ. మల్లేశం గౌడ్, ఉమెన్ ఏ.ఎస్.ఐ. ప్రమీలా, జిల్లా సఖి సెంటర్  అడ్మినిస్ట్రేటర్  రోజా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related posts

రెండు రోజుల సీఐడీ కష్టడీకి చంద్రబాబు

Satyam NEWS

దగ్గు మందు తాగి 18 మంది చిన్నారుల మృతి

Satyam NEWS

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటియేషన్ కార్డులు

Satyam NEWS

Leave a Comment