Slider జాతీయం తెలంగాణ

అంతర్గత భద్రతపై పరస్పర సహకారం

dgp confarence

దేశ అంతర్గత భద్రత పరిరక్షించే అంశాలలో పరస్పరం సహకరించుకోవాలని దక్షిణాది రాష్ట్రాల డీజీపీ సమావేశం నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో హైదరాబాద్ లో సమావేశమైన దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. శాంతి భద్రతలు,  సైబర్ నేరాలు, మావోయిస్టు కార్యకలాపాలు,  ఉగ్రవాదచర్యలు, మాదకద్రవ్యాల రవాణా తదితర అంశాలపై డీజీపీలు చర్చించారు. ఈ సమావేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లతో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ నుంచి పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు అదనపు డీజీపీలు ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Related posts

ఎన్నో ఆశలతో నన్ను గెలిపించారు:జగన్

Satyam NEWS

ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం: ఉద్రిక్తత

Satyam NEWS

గ‌ణేష్ నిమజ్జ‌నానికి విస్తృత ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment