34.2 C
Hyderabad
April 19, 2024 22: 48 PM
Slider హైదరాబాద్

నో చేంజ్:స్పాలో వ్యభిచారం నిర్వహిస్తున్నగలీజు గాళ్ళు

spa massage centers procitution raid kphb police arrested

పోలీస్ లు ఎన్ని దాడులుచేసిన వారి తీరు మారడం లేదు.డబ్బు తో ప్రలోభ పెడుతూ అందమైన అమ్మాయిలను, అమ్మాయిలను ఎరవేసి విటులను ఆకర్షిస్తూ డబ్బులు దండుకుంటు గలీజు దందా నిర్వహిస్తున్న స్పా సెంటర్ల ఉదంతమిది.స్పా ముసుగులో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను హైదరాబాద్, కేపీహెచ్‌బీ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు.అమ్మాయిలతో స్పా, సెలూన్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఫ్లాట్‌పై కేపీహెచ్‌బీ పోలీసులు దాడిచేశారు.

ఇద్దరు నిర్వాహకులు, ఆరుగురు విటులను అరెస్టు చేశారు. కేపీహెచ్‌బీ కాలనీ ఆరో ఫేజ్‌లో గ్లోవెల్‌ ఫ్యామిలీ స్పా అండ్‌ సెలూన్‌ సెంటర్‌ను వెంపటి సతీష్‌ నిర్వహిస్తున్నారు. స్పా సెంటర్‌ పేరుతో వ్యబిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం అందడంతో పోలీసులు శనివారం రాత్రి దాడి చేశారు. నిర్వాహకుడు సతీష్‌, ఓ ఉద్యోగినితోపాటు ఆరుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకొని మహిళా సంరక్షణ కేంద్రానికి తరలించారు.

ముగ్గురు మహిళలు, ఆరుగురు విటులు, ఓ మహిళా ఉద్యోగితోపాటు నిర్వాహకుడు సతీశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి లక్షా పదమూడువేల రూపాయల నగదు, తొమ్మిది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ లక్ష్మీనారాయణన తెలిపారు.

Related posts

10 గ్రేడింగ్ పాయింట్స్ సాధిస్తే రూ.10,000 బహుమతి

Satyam NEWS

Top Secret: గజ్వేల్ లో పోటీ చేస్తానని ఈటల ఎందుకు అంటున్నారు?

Satyam NEWS

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment