37.2 C
Hyderabad
April 18, 2024 21: 23 PM
Slider చిత్తూరు

బివేర్: కళ్లనూ మోసం చేసే కరోనా వీడియోలు

qarantain ccenter

ఈ మూడు ఫొటోలూ జాగ్రత్తగా చూడండి శ్రీ గణేష్ సదన్ అని బోర్డు ఉంది. మరి అందులోని ముస్లింలు బయటకు వస్తున్నారు. ఇదేమిటి? అసలు ఎక్కడ జరిగింది? ప్రముఖ పుణ్య క్షేత్రమైన కాణిపాకం దేవస్థానానికి సంబంధించిన ఫొటోలు ఇవి. కాణిపాకం దేవస్థానం నిర్మించిన సత్రం ఇది.

దీన్ని కరోనా క్వారంటైన్ కేంద్రంగా చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ముస్లింలు హిందూ దేవాలయంలోకి చెప్పుల తో వెళుతున్నారని కొందరు కామెంటు పెట్టారు. మత విషయాలను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు.

మరి కొందరు అయితే హిందువుల దేవాలయాన్ని కరోనా క్వారంటైన్ కేంద్రానికి ఇచ్చారు. హిందువులు ఎంత విశాల హృదయులో చూశారా? మరి ముస్లింలు ఎవరైనా తమ మసీదును క్వారంటైన్ కేంద్రానికి ఇస్తారా అంటూ రెచ్చగొట్టాలని చూశారు.

ఇదే వీడియోకు కొత్త భాష్యం చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. వాస్తవానికి జరిగింది ఇదేదీ కాదు. కాణిపాకం దేవస్థానం పక్కనే ఉన్న ఈ సత్రంలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. క్వారంటైన్ కేంద్రానికి కోవిడ్ 19 పేషంట్లను పంపడం మొదలు పెట్టారు.

విషయం తెలుసుకున్న స్థానికులు అధికారుల వద్దకు వెళ్లారు. తాము కుటుంబాలతో ఇక్కడే ఉంటామని ఇక్కడ క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేస్తే తమకు ప్రమాదమని ఫిర్యాదు చేశారు. ఎవరు అజాగ్రత్తగా ఉన్నా తమకు ప్రమాదమని స్థానికులు చెప్పారు.

క్వారంటైన్ కేంద్రాలను ఊరికి దూరంగా పెడితే సబబు గా ఉంటుందని చెప్పారు. దాంతో అధికారులు కూడా ఆలోచనలో పడ్డారు. క్వారంటైన్ కేంద్రాన్ని చిత్తూరు శివారు ప్రాంతానికి తరలించారు. కోవిడ్ 19 పేషంట్లను అక్కడకు తరలించారు. ఆ సమయంలో తీసిన వీడియో కు ఇన్ని రకాల కామెంట్లతో మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూశారు. అందుకే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే వీడియోలపై వాస్తవాలు తెలుసుకోనిదే ఎవరూ రియాక్ట్ కావద్దని సత్యం న్యూస్ కోరుతున్నది.

Related posts

కరీనా వారియర్ ప్రశంస పొందిన కువైట్ కడప వాసి

Satyam NEWS

ఉదారత చాటిన దళిత గిరిజన ప్రజాప్రతినిధులు

Satyam NEWS

ఆధార్ కార్డు ఉన్నంత మాత్రాన భారత పౌరులు కాదు

Satyam NEWS

Leave a Comment